బాబును ఎదుర్కోలేక.. అసహనంలో జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో పలుమార్లు ఢిల్లీ యాత్రలు చేశారు. ఢిల్లీలో ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని కూడా ఉబలాటపడ్డారు. కానీ.. కొన్ని ఛానెళ్లతో ఇంటర్వ్యూలు ఇచ్చే ఏర్పాటు చేసుకునేలోగా.. చెమట చిందించాల్సి వచ్చింది. అదే చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన వేళకు ఆయన ఇంటర్వ్యూ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా జాతీయ మీడియా చానెళ్లన్నీ ఎగబడుతున్నాయి. పోటీ పడి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. దాదాపు 15 జాతీయ మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాటి పరిణామం.. జగన్ కు అసహనం కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ.. ఆ అసహనంలో ఆయన చంద్రబాబు బావో, గొయ్యో చూసుకుని దూకితే మంచిది.. అంటూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని అంటూ.. ఆయన చావును కోరుకునేలా పెడసరపు కామెంట్లు చేయడం ప్రజల్లో చులకన భావాన్ని కలిగిస్తోంది.

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు తీవ్ర విమర్శలతో ఆడిపోసుకోవడం వింతేమీ కాదు. అంతవరకు జగన్ ఎన్ని విమర్శలు చేసినా.. రాజకీయ మనుగడ కోసం అది ఎవ్వరికైనా తప్పదు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు చచ్చిపోవాలి.. అప్పటికి గానీ తాను కలగంటున్న ముఖ్యమంత్రి కుర్చీ తనకు దక్కడం కష్టం అనుకుంటూ మాటలు మాట్లాడితే మాత్రం.. ప్రజలు మన్నించరు. చంద్రబాబు భౌతికంగా కనుమరుగైపోవాలని కోరుకుంటూ.. అదే రాజకీయ ఎజెండా అయినట్లుగా జగన్ మోహన రెడ్డి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

‘మేం అవిశ్వాసం పెట్టకుండా ఉంటే చంద్రబాబునాయుడు పెట్టి ఉండేవాడా’ వంటి విమర్శలు జగన్ ఎన్నయినా చేయవచ్చు. ఖచ్చితంగా ఇవి చంద్రబాబు మీద జగన్ పైచేయిని నిరూపించే అంశాలే. అవిశ్వాసం విషయంలో జగన్ చెప్పింది నిజమే. ఆ రకంగా ప్రజల్లో చంద్రబాబును మించి తన ఆదరణను పెంచుకోవాలే తప్ప.. ఆయన ఇమేజిని ఎదుర్కొనలేక ఇలా చచ్చిపోవాలంటూ కోరుకోవడం.. తన పట్ల ప్రజల్లో చులకన భావం కలిగిస్తుందని జగన్ తెలుసోవాలి.

ఇలాంటి పెడపోకడలను  జగన్ ప్రదర్శించడం ఇది మొదటి సారి కాదు.. గతంలో కూడా పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలోనే చంద్రబాబును నడిరోడ్డులో ఉరితీయండి అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆయన వివాదానికి కారణం అయ్యారు. అప్పట్లో ప్రజల్లో ఆ కామెంట్ పరువు తీస్తున్నదని తెలుసుకుని.. దానికి కాస్త సమర్థింపు వివరణ కూడా ఇచ్చారు. ఇన్ని నెలల తర్వా.త.. మళ్లీ అదే తరహాలో.. చంద్రబాబు భౌతికంగా లేకుండాపోవాలని అంటూ మాట్లాడడం వివేకం కాదని పలువురు అంటున్నారు.

4 Comments

  1. Moorkhudi alochanalu, cheshtalu moorkhamgane vuntayi.Telivaina vadu samskaram,samyamanmto vyavaharistadu.Andhra prajalu telivaina varu.Evaru entha chinchukunna samarthulake vaaru pattam kadataru. Nayakudanna vadu vunnatam ga vimarsa cheyali.Adi atani samskaram teliya chestundi.

  2. People of A.P do not understand what sin they have committed to be blessed with such an opposition leader who lacks basic understanding of politics, who do not keep his word on timing on M.P’s resignations, always prefers abusive language.

  3. దేశ‌మంతా మోడి స‌ర్కారు తీరుపై ముక్కున వేలేసుకుంటోంది.. ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌! ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయానికి భ‌య‌ప‌డే అవిశ్వాసాన్ని మోడీ ఎదుర్కొన లేకపోయార‌ని దేశం అంటోంది.. ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌! మోడీ నియంతృత్వ ధోర‌ణుల‌పై చాలామంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌! ఆంధ్రాకి జ‌రిగిన అన్యాయం గురించి పార్ల‌మెంటులో మాట్లాడే ద‌మ్మూ ధైర్య‌మూ మోడీ స‌ర్కారు లేద‌ని అర్థ‌మైపోయింది.. ఒక్క జ‌గ‌న్ కి త‌ప్ప‌! రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉన్న‌ప్పుడు కూడా సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడే ప్ర‌తిప‌క్ష నేత చ‌రిత్ర‌లో ఎవ్వ‌రూ ఉండరేమో..ఇలా ఒక్క జ‌గ‌న్ త‌ప్ప‌..! సుదీర్ఘ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నామస్మరణమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్రంపైనా మోడీపైనా విమర్శలు చేయని వ్యక్తి ఏపీలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క జగన్ తప్ప.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.