జ‌గ‌న్ భ‌య్యా.. భ‌యం మొద‌లైంద‌య్యా!

ఏదో త‌న పాద‌యాత్ర‌లు తాను చేసుకుంటూ వెళ్లున్నాడు. టీడీపీ విమ‌ర్శ‌లు.. జ‌న‌సేన క‌సుర్లు.. ఇవ‌న్నీ త‌న సీఎం సీటును ఆప‌లేవ‌నేది జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌గాఢ విశ్వాసం. కానీ.. సీన్ రివ‌ర్స్ కావ‌టంతో మ‌ళ్లీ య‌వ్వారం మొద‌టికొచ్చింది. ఫ‌లితంగా ఎవ‌రు ఎటు నుంచి కుర్చీకింద‌కు క‌ష్టాలు తెచ్చిపెడ‌తార‌నే భ‌యం కూడా వెంటాడుతుంద‌ట‌.  తండ్రి స్థానం త‌న‌కు గాకుండా రోశ‌య్య‌కు క‌ట్టబెట్టిన కాంగ్రెస్ అదిష్ఠానంతో సై అంటూ తొడ‌కొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టిన జ‌గ‌న్ బాగానే బ‌ల‌ప‌డ్డాడు. అయితే.. హ‌స్తం పార్టీ నుంచి జ‌గ‌న్‌పై అనుకున్నంత విమ‌ర్శ‌లేం రాలేదు. పైగా రేపోమాపో మాతో జ‌త‌క‌ట్ట‌క‌పోతాడా! అనే న‌మ్మ‌కంకూడా ర‌ఘువీరారెడ్డి వంటివాడిని బోల్తా కొట్టించింది. పైగా త‌మ దివంగ‌త నేత వైఎస్సార్ త‌న‌యుడు. ఎలా తిట్టాలి.. ఏమ‌ని తిట్టాల‌నే సందిగ్థ‌త కూడా చాలామంది హ‌స్తం నేత‌ల‌ను వెన‌క్కినెట్టేసింది. అయితే ఇదంతా తెలియ‌ని రాహుల్‌గాంధీ మౌనంగానే ఉంటూ వ‌చ్చారు. పైగా ఏపీ రాజ‌కీయాల్లో వేలుపెడితే ఎటువంటి ప‌రిణామాలు చవిచూడాల్సి వ‌స్తుంద‌నే భ‌యం కూడా ఆయ‌న‌లో ఉన్న‌ట్టుంది. అయితే ఇటీవ‌ల ఏపీ స‌మీక్ష స‌మావేశంలో మాత్రం రాహుల్ గ‌ట్టిగానే క్లాసు తీసుకున్నార‌ట‌. ఫ‌లితంగా వైసీపీ కూడా త‌మ ప్ర‌త్య‌ర్థే అనే నిర్ణ‌యానికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది.
ఇదే స‌మ‌యంలో మొన్న‌టి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో రాహుల్‌గాంధీ, చంద్ర‌బాబునాయుడు ఒకే వేదిక‌పై క‌ల‌వ‌టం కూడా కొత్త రాజ‌కీయ పొత్తుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్ట‌యింది.  ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో టీడీపీ, కాంగ్రెస్ క‌ల‌వ‌వ‌చ్చ‌నే సంకేతాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇది కొంద‌రు టీడీపీ క‌ర‌డుగ‌ట్టిన నేత‌లు వ్య‌తిరేకించినా.. రాజ‌కీయాల్లో పొత్తులు ఎలా ఉండాల‌నేది అదినేత అబీష్ట‌మే ఫైన‌ల్ అనేది టీడీపీ  శ్రేణుల అభిప్రాయ‌ం. టీటీడీపీ నేత‌లు కూడా.. తెలంగాణ‌లో హ‌స్తంతో క‌ల‌సి వెళితే త‌ప్పేమిటంటూ స్పందించ‌టం చూస్తుంటే.. చేయి, సైకిల్ క‌లిసేలా వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంద‌నే చెప్పాలి.  లోపాయికారీ ఒప్పందంతో వైసీపీకు మేలు చేద్దామ‌నుకున్న హ‌స్తం నేత‌లు  టీడీపీ పొత్తుతో కాస్త ఊపిరి పీల్చుకుంటారు. పైగా ప‌వ‌ర్ చేతికి వ‌చ్చే అవ‌కాశాలు మెరుగుప‌డ‌టంతో మ‌రింత క‌ష్ట‌ప‌డే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఇవ‌న్నీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ లైట్ గా తీసుకున్న జ‌గ‌న్‌.. ఈ పొత్తు.. ఏపీలో త‌న విజ‌యానికి మోకాల‌డ్డుతుంద‌నే భ‌యంతో ఉన్నార‌ట‌. పైగా.. యాత్ర‌లో స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌న స‌మీక‌ర‌ణ ఓటు బ్యాంకుగా మారుతుందా! అనే బెంగ కూడా ప‌ట్టుకుంద‌ట‌. పైగా ప‌వ‌న్ ఉత్త‌రాంద్ర ఎఫెక్ట్ అటు టీడీపీ, ఇటు వైసీపీ ఓట్ల‌పై ప‌డుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇక‌పోతే.. కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌టంతో వైసీపీ కేడ‌ర్ చీలే అవ‌కాశాలున్నాయి. ఇవ‌న్నీ జ‌గ‌న్ భ‌య్యాకు.. తెలియ‌కుండానే చెమ‌ట ప‌ట్టిస్తున్నాయ‌నే గుస‌గుస‌లు రాజ‌కీయ‌వేదిక‌ల‌పై వినిపిస్తున్నాయ‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.