అమ్మో.. జగన్ మామూలోడు కాదుగా..!

వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పరితపిస్తున్న జగన్.. అందుకోసం అనేక ప్లాన్లు వేస్తున్నాడు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు అధికార పార్టీని బలహీనం చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకుని టీడీపీని దెబ్బకొట్టాలని భావిస్తున్నాడు. అయితే, ఈ విషయంలో నాలుగు సంవత్సరాలుగా జగన్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. అందుకే సమయం కోసం వేచి చూస్తున్న జగన్.. ఏపీలో కీలకాంశాలైన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి వాటిపై దృష్టి సారించాడు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించాడు. ఇక అప్పటి నుంచి వైసీపీకి ఎక్కడలేని అనుకూలత వస్తుందనుకున్న సమయంలో, టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చి కేంద్రంపై పోరాటానికి సిద్ధమై షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి నిన్నటి అవిశ్వాస తీర్మానం వరకు ఏపీ తరపున టీడీపీనే పోరాడుతుంది అనేంతగా ఆ పార్టీ పలు కార్యక్రమాలు చేసింది. దీంతో టీడీపీకి ఏపీ ప్రజల నుంచి మద్దతు బాగా పెరిగిపోతూ వస్తోంది.

 కాసేపు ఇవన్నీ పక్కన పెడితే, అసలు వైసీపీ ఎంపీల రాజీనామా అంశం అటు ఏపీలోనే కాక, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీని వెనుక బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు ఉన్నాయని, అందుకోసమే వారి రాజీనామాల ఆమోదానికి స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఆ పార్టీ ఎంపీలు దూరమయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎంపీలు వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారనే విషయం జగన్ అండ్ కోకు ముందుగానే తెలిసిపోయిందట. రాజీనామా లేఖలను స్పీకర్‌కు ఇచ్చిన వైసీపీ ఎంపీలు.. వాటిని ఆమోదించమని ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కారణం కూడా అదేనని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వాళ్లు సభలో ఉంటే, అవిశ్వాసానికి మద్దతు తెలపాలని, లేకుంటే ఏపీ ప్రజల దృష్టిలో విలన్లు అయిపోతారని భావించారని, అందుకోసమే వారు పట్టుబట్టి మరీ రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.