పవన్‌పై జగన్ వ్యాఖ్యలతో వైసీపీలో కలకలం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం ఎలా ఉండబోతుంది..? ఈ వ్యాఖ్యల వల్ల వైసీపీ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది..? అసలు పవన్‌పై జగన్ ఇంతలా రియాక్ట్ అవడానికి వెనుకు కారణం ఏమిటి..? ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు పవన్ గురించి అస్సలు పట్టించుకోని జగన్ ఒక్కసారిగా ఆయన గురించి స్పందించడం.. అది కూడా వ్యక్తిగత జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేతపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పవన్ అభిమానులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అయితే, జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో కూడా కలకలం రేగుతోందట.

వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏపీకి సీఎం కావాలని కలలుకంటున్న జగన్‌.. ప్రస్తుతం ఏం చేసినా వ్యతిరేకతే వస్తోంది. ఆయన తలపెట్టే కార్యక్రమం ఏదైనా ప్రజా స్పందన కరువవడంతో ఆయన బాగా నైరాశ్యానికి గురవుతున్నాడట. మంగళవారం వైసీపీ నిర్వహించిన బంద్‌కు ప్రజల నుంచి స్పందన లేకపోవడం.. పవన్-జగన్ కుమ్మక్కయ్యారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుండడం వల్లనే జగన్ అతిగా స్పందించాడని తెలుస్తోంది. అయితే, అవి కాస్తా శృతి మించడంతో పెద్ద దుమారం రేగింది. గతంలో కూడా జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎంను కాల్చి చంపేయాలని, మరో బహిరంగ సభలో చంద్రబాబును ఉరి తీయాలని దారుణంగా కామెంట్లు చేశాడు. ఇది అప్పట్లో సంచలనం అయింది.

తాజాగా జగన్.. జనసేనానిపై చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్‌పై చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గానికి అంటగట్టే ప్రమాదం ఉండడం వల్ల ఆ వర్గానికి చెందిన ఓటర్లు వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని వారు బాహాటంగానే చెబుతున్నారు. జగన్ అనాలోచిత వ్యాఖ్యల వల్ల వైసీపీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని స్వయానా ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.