జగన్ తీరు చూస్తే నవ్వొస్తోంది.. ఇదేం రాజకీయం బాబోయ్!

వైసీపీ అధినేత, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూసి నవ్వుకుంటున్నారు జనం. శ్రీకాకుళంలో పర్యటించిన జగన్.. ప్రజలకు ఇచ్చిన సందేశం విని ఆశ్చర్యపోయారు అంతా. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే కనీస పరిజ్ఞానం కూడా లేదా ఈయనకు? లేదంటే రాజకీయ కుట్రలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారా? అని సందేహం కలుగుతోందట జనాలకు.
జిల్లాలో పాద‌యాత్ర సంద‌ర్భంగా తిథిలీ తుఫాను బాధితుల గురించి మాట్లాడి పప్పులో కాలేశారు జగన్. ఆంధ్రాలో తిథిలీ తుఫాను వచ్చినప్పుడు వ‌ల్ల ఒక్క ఎచ్చ‌ర్ల మండలంలోనే దాదాపు 12 వంద‌ల ఎక‌రాలు న‌ష్ట‌పోతే, దాన్ని 4 వంద‌ల ఎక‌రాల‌కు చంద్రబాబు ప్ర‌భుత్వం కుదించింద‌ని, ఇంతకీ తిథిలీ బాధితులకు చంద్రబాబు చేసిందేమిటని జగన్ ప్రశ్నించటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు తిథిలీ  బాధితులను గొప్ప‌గా ఆదుకున్నాను అంటూ భారీ ఎత్తున చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నారని, శ్రీ‌కాకుళం నుంచి ఏ బ‌స్సుపోయినా చంద్ర‌బాబు ఫొటో క‌నిపిస్తుంద‌ని, బాధితుల‌ను ఆదుకున్న‌ట్టుగా గొప్ప‌గా విజ‌య‌వాడ‌లో ఫ్లెక్సీలు పెడ‌తారీ పెద్ద మ‌నిషి.. ఎక్క‌డ చూసినా ఆయ‌న ఫొటోలేన‌నీ, ఆయన తీరు చూస్తుంటే శ‌వాల మీద చిల్ల‌ర ఏరుకుంటున్న‌ట్టుగా ఉందని జగన్ విమర్శించటం ఆంధ్రా ప్రజల్లో అంతుపట్టని కోపం తెప్పిస్తోందట. 
నిజానికి తిథిలీ తుఫాను వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు ఆపన్న హస్తం అందించి నీడనిచ్చింది. ఈ విషయం జగన్‌కి తెలియదు కావచ్చు. ఎందుకంటే ఆ విపత్తును ఆయన పట్టించుకుంటే కదా! అసలు ఆ సమయంలో జగన్ ప‌క్క జిల్లాలో పాద‌యాత్ర చేసుకుంటూ తిరిగారే తప్ప.. తిథిలీ బాధితుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు, తిథిలీ బాధితుల‌ను ఆదుకునేందుకు విరాళాలు ఇస్తే, వాటిని అధికార పార్టీ నేత‌లు దుర్వినియోగం చేస్తార‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అప్ప‌ట్లో విమర్శించారు కూడా. అవన్నీ మర్చిపోయావా? జగన్.. ఇప్పుడొచ్చి శ్రీరంగ నీతులు చెప్తే మాకవి అర్థం కావా? అనే కోణంలో జనం చర్చించుకుంటున్నారు. ఈ తతంగం అంతా చూసి.. ఇదంతా జగన్ చేస్తున్న రాజకీయ కుట్రే తప్ప మరోటి కాదంటూ చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. లేనిది ఉన్నట్లు చెబుతూ జనం మెప్పు పొందాలనుకోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమే. ఇదేం రాజకీయం బాబోయ్..! అని ముక్కున వేలేసుకుంటున్నారు ఇంకొందరు. నిజమే కదా మరి! ఆ దిశగా ఓసారి ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.