జగన్ ఆటో ప్రకటన

ఏదో ఒక కొత్త హామీతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విపక్ష నేత జగన్. ఇప్పుడు ఏపీ ఆటోడ్రైవర్లపై ఆయన మనసు పడింది. అంతే జగన్ కొత్త హామీ ఇచ్చారు. కొత్తగా ఆటో కొనుగోలు చేసే వారికి పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్దిక సాయం చేస్తుందని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం. ఇది చేస్తామనే ప్రకటలు చాలానే చేస్తున్నారు జగన్. ఇప్పుడు అదే చేశారని టీడీపీ అంటోంది. ఇవన్నీ ఆచరణ రూపం దాల్చేవి కావు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రస్తావిస్తున్నారు. అయినా సరే వెనక్కు తగ్గడం లేదు జగన్. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీలేని రుణాల విషయంలో జగన్ ఎలాంటి హామీనివ్వలేదు. ఆ ఫలితం తర్వాత తెలిసొచ్చింది. ఈసారి ఎలాంటి తప్పు చేయడం లేదు జగన్. అవకాశం ఉన్నా లేకపోయినా హామీ ఇస్తే పోలా.. తర్వాత చూసుకుందామనే తరహాలోనే జగన్ తీరు ఉంది.  
ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ ను ఆటోడ్రైవర్లు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయి. అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్నదని చెప్పారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, రోడ్‌ టాక్స్‌ పత్రాలు లేనందున పోలీసులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెప్పారు. అందువల్ల ఈ ఇబ్బందులు పడుతున్న ఆటోవాలాలను ఆదుకోవడానికి ప్రభుత్వమే పదివేల రూపాయల సాయం చేస్తుందని జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనతో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ సర్కార్ దీనిపై ప్రకటన చేసే వీలుంది. ఆటో డ్రైవర్లు ఎంత మంది ఉంటారులే అనుకోవడం ఉండదు. వారి ప్రభావం మిగతా వారి పైనే ఉంటోంది. మొన్న కృష్ణా జిల్లాకు అన్న ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్.. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కొత్త హమీనివ్వడం ఆసక్తికరమే.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.