మరో టర్న్.. రిజర్వేషన్లపై మరోసారి మాట మార్చిన జగన్

కొద్దిరోజులుగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాపు రిజర్వేషన్ల అంశం కుదిపేస్తోంది. అసలు తన ప్రజాసంకల్పయాత్ర రూట్ మ్యాప్‌లో లేని జగ్గంపేట నియోజకవర్గానికి వెళ్లి మరీ, కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేశాడు. ఆ సభలో ‘‘నేను ఏదైనా మాట ఇస్తే మాట మీదే నిలబడతా. చేయగలిగింది మాత్రమే చెబుతా. నాకు చేయలేనిది చెప్పే అలవాటు లేదని కాపు సోదరులకు చెబుతున్నా. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలు ఉంటాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనివి ఉంటాయి. అలాంటిదే ఈ రిజర్వేషన్‌ సమస్య. రిజర్వేషన్లు 50 శాతం దాటితే సుప్రీం కోర్టు జడ్జిమెంటు ఉన్న పరిస్థితులలో… ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు కాబట్టి వీటిమీద నేను చేయగలినది ఏమీ లేదు. కాబట్టి నేను చేయలేకపోతున్నా అని కచ్చితంగా మీ అందరికీ… ఏ మాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నా’’ అని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు.

ఏమంటూ కాపు రిజర్వేషన్ల విషయంలో యూటర్న్ తీసుకున్నాడో గానీ, పాపం జగన్‌కు ఆ సామాజిక వర్గం నేతలు చుక్కలు చూపించారు. మరీ, కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ వారికి వ్యతిరేకంగా ప్రకటన చేయడంతో, వారంతా పదే పదే జగన్ పాదయాత్రకు అడ్డు పడుతున్నారు. అంతేకాదు, రిజర్వేషన్ల విషయంలో మాట మార్చాడని జగన్‌ను బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మరోసారి సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం పిఠాపురంలో పర్యటిస్తున్న జగన్ కాపు రిజర్వేషన్లపై మరోసారి మాట మార్చాడు. రిజర్వేషన్ల విషయంలో తాను ఒకే నిర్ణయంతో ఉన్నానని, యూ టర్న్ తీసుకునే టైపు తాను కాదని, జగన్ వెల్లడించాడు. అంతేకాదు, రిజర్వేషన్ల అంశానికి తన మద్దతు ఉంటుందని స్పష్టంగా ప్రకటించాడు. తాను మాట తప్పేవాడిని కాదని, బీసీలకు అన్యాయం జరగకుండా… కాపులను బీసీల్లో చేర్చాలన్న వైఖరిలో మార్పులేదన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.