జగ‌న్‌- ప‌వ‌న్ ఎక్క‌డ దాక్కున్నారు?

మోడీ స‌భ‌కు వైసీపీ త‌ర‌ఫున జ‌న‌స‌మీక‌ర‌ణ దృశ్యాలు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ప‌వ‌న్‌ల నిజ స్వ‌రూపం ఇపుడు తెలిసింది. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఆరాతీస్తే వాస్త‌వాలు అర్థ‌మ‌వుతాయి.
1. మోడీ అమ‌రావ‌తిని ఢిల్లీ కంటే బాగా క‌ట్టిస్తాను అన్నాడా ? లేదా?
అన్నాడు.. ఎందుకు క‌ట్టివ్వ‌లేదు మోడీ అని జ‌గ‌న్ ఎందుకు అడ‌గ‌లేదు.
2. రైల్వే జోన్ ఏపీకి ఇస్తామ‌ని బీజేపీ చెప్పిందా? లేదా?
చెప్పింది … మ‌రి జ‌గ‌న్ ఎందుకు మోడీని ఈ డిమాండ్ చేయ‌డం లేదు
3. పోల‌వ‌రం కేంద్రానిదే. కేంద్రానికే వ‌దిలేస్తే ఎపుడో క‌డుతోంది. రాష్ట్రం చొర‌వ తీసుకుని ముందే క‌డితే రైతుల‌కు లాభ‌మా? కాదా?
రైతుల‌కు లాభ‌మే…. మ‌రి పోల‌వ‌రం విష‌యంలో కేంద్రాన్ని జ‌గ‌న్ డ‌బ్బులు ఎందుకు అడ‌గ‌డం లేదు?
4. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ఇస్తామ‌ని అప్ప‌ట్లో బీజేపీ హామీ ఇచ్చిందా? లేదా?
ఇచ్చింది… మ‌రి సొంత జిల్లా త‌ల‌రాత మార్చే స్టీల్ ప్లాంట్ హామీ జ‌గ‌న్ ఎందుకు వెంట‌నే ఇవ్వ‌మ‌ని మోడీని అడ‌గ‌డం లేదు. సొంత‌జిల్లాకే న్యాయం చేయ‌ని వాడు ఎవ‌రికి చేస్తారు?

మ‌రి జ‌గ‌న్ రాష్ట్రం కోసం ప‌నిచేస్తున్నారా? మోసం చేసి రాష్ట్రానికి వ‌స్తున్న మోడీని ఎందుకు నిల‌దీయ‌కుండా ఉన్నారో జ‌నాల‌కు వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా? లేదా? మ‌రి రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని, మోదీని ప్ర‌శ్నించేందుకు మాత్రం విప‌క్షం వైసీపీతో పాటు మ‌రో కీల‌క పార్టీ జ‌న‌సేన సాహ‌సం చేయ‌డం లేదు. అస‌లు మోదీపై సింగిల్ విమ‌ర్శ చేయ‌డానికి కూడా ఈ రెండు పార్టీలు సిద్ధంగా లేవనే త‌మ చ‌ర్య‌ల‌తో నిరూపించేసుకున్నాయి. రాష్ట్రం మొత్తం ఈరోజు మోడీని నిల‌దీస్తుంటే … ఈ రెండు పార్టీలు సైలెంట్‌గా ఉన్నాయి. పైగా వైసీపీ మోడీ స‌భ‌కు భారీ ఎత్తున జ‌న‌సమీక‌ర‌ణ చేయ‌డం చూస్తుంటే… జ‌గ‌న్‌-మోడీ గూడుపుఠానీ నిజ‌మే అని తేలిపోయింది.

1 Comment

  1. ఈరోజు మోడీ రాక సందర్భంగా ఆంధ్ర జనాలకు బాగా అర్థమైపోయింది ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎవరు పోరాడుతున్నారో, మన రాష్ట్రంపై కుట్రలు చేస్తున్న మోడీకి లొంగిపోయి తెరవెనుక ఎవరు మద్దతు పలుకుతున్నారో !

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.