జగన్ @ 1000 కిలోమీటర్లు

జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్ మార్క్ చేరింది. ఎలాగైనా అధికారమే లక్షంగా జగన్ గత ఏడాది నవంబర్ 6 నుంచి ఇడుపుల పాయ ఇచ్చాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ప్రారంభంలో కొంచెం మందకొడిగా మొదలైన యాత్ర మొత్తం 74 రోజుల పాటు ఐదు జిల్లాల్లో యాత్ర పూర్తి చేసుకోనుంది. మొదట కడప జిల్లాలో ప్రారంభమైన యాత్ర కర్నూలు, అనంతపురం, చిత్తూరు మీదుగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. కడప, కర్నూలు జిల్లాల్లో 25 రోజుల పాటు జరగ్గా కర్నూలులో మొత్తం 18 రోజుల పాటు.. 7 నియోజకవర్గాల్లో 240 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో, చిత్తూరు జిల్లాలో 6 నియోజక వర్గాల్లో యాత్ర చేసి నెల్లూరు జిల్లా కొనసాగుతోంది. వెంటకటగిరిలో 1000 కిలోమీటర్లు పూర్తి కానుండడంతో అక్కడ పైలాన్ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.. ఈ నేపద్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమానికి వైసీపి పిలుపునిచ్చింది.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రేపు పార్టీ నేతలు, కార్యకర్తలంతా రెండు కిలోమీటర్లు నడిచి జగన్ కు సంగీభావం తెలపనున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపి నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర రేపటితో వెయ్యి కిలోమీటర్లు పూర్తి కానుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతుండడంతో సైదాపురంలో స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేసారు.. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వాక్ విత్ జగనన్న పేరుతో రేపు రెండు కిలోమీటర్లమేరకు పార్టీ నేతలంతా పాదయాత్ర చేయాలని పార్టీ పిలుపు నిచ్చింది.. మొత్తం 25 పార్లమెంటరీ కేంద్రాలలో 664 మండల కేంద్రాల్లో ఈ యాత్రలు జరగనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు..
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.