పరువు తీసుకున్న ఐవైఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పరువు మరింతగా గంగలో కలిసింది. సిఎస్ గా ఉంటూ కీలక సమాచారాన్ని బయటకు లీక్ చేశారనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విపక్ష పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో అప్పుడు పోస్టులు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్టు చైర్మన్ గా ఐవైఆర్ నే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఎపి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి ప్రభుత్వ తీరుపై ఐవైఆర్ విమర్శలు సాగిస్తున్నారు. అందుకే ఉద్యోగుల వేల్పేర్ ఫండ్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగించారని అర్థమవుతోంది. 
చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఐవైఆర్ ఆరోపణలు చేస్తుండగా… కృష్ణారావు చర్యలే అలా చేశాయంటున్నారు మరికొందరు. ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టే ఆలోచన చేయకూడదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్‌ కంపెనీలకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తోందనేది ఐవైఆర్ చేసిన ఆరోపణ. ఏపీ సర్కార్‌ చేపట్టిన పనులు స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా చేసేవి కాదన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ అంటే కంపెనీలే ముందుకు రావాలి. సింగపూర్‌, విదేశాల్లో చేసే వ్యవహారాలపై చాలామంది ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారని ఐవైఆర్ అంటున్నారు. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా సర్కార్‌ కాంట్రాక్టులు ఇస్తోందని విమర్శించారు ఐవైఆర్. 
రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు అనుకూలంగా చట్ట సవరణ చేశారని కీలక సంగతి బయట పెట్టారు. అమరావతి నగర నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ విధానం సరైంది కాదంటున్నారాయన. ముందుగా రాజీనామా చేస్తే పరువు దక్కేది. అలా కాకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అదే పదవిలో కొనసాగడం ఐవైఆర్ కే చెల్లింది. అందుకే తన పరువు తానే తీసుకున్నాడంటున్నారు. అదే సమయంలో తనను తీసేశారనే సానుభూతి ప్రజల్లో వస్తుందనే ఆలోచనతోనే పదవులకు రాజీనామా చేయాలేదనే వాదన లేకపోలేదు. 

1 Comment

  1. తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని ఒక ఉద్యోగి విమర్శిస్తున్నాడంటే అతనిలో లోపమున్నా ఉండాలి, లేక ప్రభుత్వం చేతకానిదైనా అయిఉండాలి. పరిపాలనలో లొసుగులున్నాయని పరిపాలించే ముఖ్యాధికారే మీడియా ముందుకు వచ్చి అంటున్నాడంటే అతను కరడుగట్టిన రాజకీయనాయకుడే తప్ప, మామూలు ఉద్యోగి మాత్రంకాదు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.