పవన్ తో ఉమ్మడి కార్యాచరణ సాధ్యమేనా?

ఇటీవల ఏపీలో జరిగిన ఒక సమావేశంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని వామపక్షాల నేతలు, జనసేన ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇది ఎంతవరకూ కార్యరూపం ధరిస్తుందనే దానిపై పలు అనుమానాలు నెలకొన్నన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం వామపక్షాలలోని ఒక వర్గం పవన్ తీరును, ఆ పార్టీని వ్యతిరేకించడమేనని సమాచారం. ఈ నేపధ్యంలో వామపక్షాలు ఇటువంటి ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్నటి వరకు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వెంట నడిచిన వామపక్ష పార్టీలు ఇప్పుడు సీపీఐ – సీపీఎంలు  వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి పవన్ వైఖరి నచ్చకపోవడం ఒక కారణంకాగా జగన్ లోని కట్టుబాటు ఇంకో కారణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వామపక్ష పార్టీల్లో కొంతమంది పవన్ వెంట వెళ్లాలని భావిస్తుండగా, మరికొంతమంది జగన్ వైపే వెళ్లాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దీంతో వై ఎస్ రాజశేఖర రెడ్డితో వామపక్ష నేతలకు ఉన్న అనుబంధం మరోమారు చిగురించేలా కనిపిస్తోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 
గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ వెనుక తిరుగుతున్న వామపక్షాలకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గ పరిశీలకుల నియామకాలు, పార్టీలోని కీలక పదవులను ఒకే కులానికి చెందిన వారికే ఇవ్వడం వామపక్ష నాయకులకు రుచించలేదట. అలాగే ప్రజలతో సమావేశాలు నిర్వహించినప్పుడు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బోగట్టా.  దీంతో ఇప్పుడు పవన్ వెనుక నడవడం ఇబ్బందిగా ఉందని వామపక్షాల నాయకులు బహిరంగంగానే అంటున్నారు. పైగా పవన్ కల్యాణ్ లో పైకి కనిపించేంత ఉదారత లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా జగన్ చేస్తున్న పాదయాత్ర కు ప్రజల నుంచి వస్తున్న స్పందన వామపక్షాలను జగన్ వైపు చూసేలా చేస్తున్నాయని సమాచారం. రిజర్వేషన్లపై విస్పష్ట ప్రకటన చేసిన జగన్ వైపు వెళ్లాలని వామపక్షాల నాయకులు భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.