
హరీష్‌రావు సైలెంట్ అయ్యాడు.. కేటీఆర్.. ఎమోషన్ అవుతున్నాడు.. కవిత.. వేధాంతం మాట్లాడుతోంది. నాయిని నరసింహారెడ్డి మాటలపై అదుపు కోల్పోతున్నారు. ఎందుకిలా.. అకస్మాత్తుగా వీరిలో ఎందుకింత నైరాశ్యం. మరో ఇరవై ఏళ్లు గులాబీ పార్టీదే అధికారం అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన నేతల్లో ఎందుకీ కలవరం. అసలేం జరుగుతోంది. ప్రభుత్వం గుట్టుగా ఉన్నాయనుకున్న తప్పిదాలు.. అవినీతి ప్రజలు గమనిస్తున్నారనేది తెలుసుకున్నారా! లేదా.. సీబీఐ చూపు. తెలంగాణ వైపు ఉన్నాయనే ముందస్తు హెచ్చరికలు ఏమైనా అందాయా! ప్రతిపక్షాలు పండుగ చేసుకునేలా.. అధికార పక్షం కుంగిపోయేలా ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది ఇప్పుడు మొదలైంది కాదు.. వరంగల్‌లో పది లక్షల మందితో సభ ఏర్పాటు చేసినపుడు.. ఏకంగా గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన టీఆర్ఎస్ కు తొలి భంగపాటు ఎదురైంది. జనసమీకరణలో హరీష్ అండ్ కో అట్టర్ ప్లాప్ కావటంతో.. బాధ్యతను పూర్తిగా కేసీఆర్ భుజాన ఎత్తుకున్నారు. ఆ తరువాత వచ్చినవే.. కులాల వారీగా నిధులు, భవన నిర్మాణాలు, గొర్రెలు, బర్రెల పంపిణీ, వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు ముందస్తు డబ్బుల పంపిణీ. ఇవన్నీ ఓట్లను రాల్చుతాయా! అనే అనుమానాలు కూడా కారు పార్టీలో గుబులు రేకెత్తిస్తున్నాయట. దీనికి రెండు మూడు కారణాలున్నట్లుగా.. ఆ పార్టీ సీనియర్లే బహిరంగంగా చెబుతున్నారు. 100 సీట్లు గ్యారంటీ అంటూ.. కవిత చెబుతున్నా.. అదంతా కట్టుకథే అంటున్నారు. ఎందుకంటే.. పార్టీను నమ్ముకున్న నేతలు.. ఉద్యమంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా వున్న వారిని పక్కనబెట్టి.. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వంటి వారికి పదవులివ్వటం పార్టీ నేతలు గుర్రుగా ఉండటానికి కారణమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు అనేది పూర్తిగా.. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి వాటిలో అవినీతిపై అధికార పార్టీ నోరు మెదపలేకుండా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో.. రెడ్డి సామాజికవర్గం కేసీఆర్ నుంచి వేరయ్యే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సానుకూలంగా ఉన్నాయనుకున్న పరిస్థితులు.. ఒక్కసారిగా మారటం.. కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది.. కాలమే నిర్ణయించాలి.
Be the first to comment