చంద్రబాబు సింగపూర్ టూర్ పై ఆరా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 12న ఆయన సింగపూర్‌‌కు బయలుదేరతారు. ఈనెల 13న అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాల్లో ఆయన కీలక భూమిక నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. సింగపూర్‌కు చెందిన కంపెనీలు అమరావతిలో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాయి. వాటిపై ముందుగా చంద్రబాబు సమీక్ష జరిపారు. 13న చంద్రబాబు తిరుగుపయనమై విశాఖ చేరుకోనున్నట్లు సమాచారం. 
ప్రత్యేక హోదా తీవ్రంగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు సింగపూర్ టూర్ పై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సింగపూర్ కు చంద్రబాబు ఇలా వెళతారని తెలియగానే విపక్షం వైకాపా విరుచుకుపడుతోంది. ఉద్యమాన్ని పక్కన పెట్టి విదేశాలకు వెళుతున్నారని అంటోంది. దోచిన డబ్బు దాచుకోవడానికే అనే విమర్శలు చేస్తోంది. కొత్తగా చేసే విమర్శలు ఏమి కాదు. కాకపోతే ఉద్యమ సమయంలో హఠాత్తుగా చంద్రబాబు అక్కడకు వెళ్లడంపై మరోవైపు బీజేపీ ఆరా తీస్తోంది. చంద్రబాబు సర్కార్ చేస్తున్న పనులపై పూర్తిగా ఆరా తీస్తోంది మోడీ టీమ్. పోలవరం, పట్టిసీమ, మరికొన్ని పనుల్లో అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికలు ఇచ్చింది. ఇలాంటి సమయంలో సిబిఐతో దాడులు చేయిస్తారా లేక మరేదైనా జరుగుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేశాం కాబట్టి దాడులతో భయపెట్టాలని చూస్తుందని చెప్పుకునేందుకు టీడీపీకి వీలు కలుగుతోంది. ఎవరు ఎంత చెప్పినా మోడీ పూర్తిగా చంద్రబాబు పాలన, పనితీరు, టూర్లపై నిఘా పెట్టడం ఇప్పుడు హాట్ టాపికైంది. తాను కాదనుకుంటే ఎంతకైనా తెగించడానికి సిద్దపడే రకం మోడీ. అందుకే చంద్రబాబును అంత తేలికగా వదిలి పెట్టరనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా నలుగురు మంత్రులపై మోడీ టీమ్ నిఘా పెట్టిందని.. త్వరలోనే వారి వివరాలు వెల్లడయ్యే వీలుందంటున్నారు. 
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.