జ‌న‌సేన పోటీ.. టీడీపీ కు లాభ‌మ‌ట‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పోరుయాత్ర‌లో బిజీగా ఉన్నారు. జ‌గ‌న్ కూడా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ రెండూ.. ఎన్నిక‌ల ముందు ప్ర‌చార‌మే.. పైగా బ‌లాబ‌లాలు లెక్క‌తెలుసుకునేందుకు కూడా. మ‌రి టీడీపీ ఎక్క‌డుంది.. అంటే.. ఆల్రెడీ.. న‌వ‌నిర్మాణ‌దీక్ష‌, మ‌హానాడుతో త‌ప్పొప్పు లు అంచ‌నా వేసే ప‌నిలో ఉంద‌నే చెప్పాలి. ఇరువైపులా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులున్నా టీడీపీ ఎందుకింత సైలెంట్‌గా ఉందంటే బోలెడు కార‌ణాలు విశ్లేషిస్తు న్నారు తెలుగు త‌మ్ముళ్లు. అదెలా అంటారా.. వైసీపీ.. ఇప్ప‌టికే అవినీతి ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేదు. పైగా బీజేపీ తో జ‌త క‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోదీను నిల‌దీయ‌ట్లేద‌ని..

 

పైగా.. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆయ‌న‌పంచ‌నే చేరారంటూ టీడీపీ ఆరోపిస్తుంది.  గ‌తంతో పోల్సితే ఈ సారి ఓట్ల‌శాతం త‌గ్గేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు టీడీపీ లెక్క‌లు క‌డుతుంది. ఇవ‌న్నీ పక్క‌న‌బెడితే  జ‌న‌సేన రాబోయే ఎన్నిక‌ల్లో  175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తాన‌ని తేల్చిచెప్పింది. అయితే.. ఎవ‌రితో పొత్తు ఉంటుంద‌నే విషయంపై ఇప్ప‌టికి క్లారిటీ ఇవ్వ‌లేదు. వైసీపీ, బీజేపీతో దోస్తీ క‌ష్ట‌మే. టీడీపీతో ఇప్ప‌టికీ సిద్ధాంత‌ప‌ర‌మైన విబేధాలున్నా.. రేప‌టి రోజున ఇద్ద‌రి మ‌ధ్య స‌యోద్య కుదిరేందుకు ఇప్ప‌టికీ దారులు తెరిచే ఉన్నాయ‌నే చెప్పాలి. అయితే.. జ‌న‌సేన త‌మ‌కు గ‌ట్టిపోటీ ఇవ్వ‌ద‌ని దేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే.. ప‌వ‌న్ పోటీలోకి దిగితే త‌మ‌కే లాభం అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ‌ల్ల వైసీపీ ఓట్లు చీలాయి. దీనివ‌ల్ల మేం ల‌బ్దిపొందాం. ఇప్పుడు  జ‌న‌సేన కూడా వైసీపీ ఓట్ల‌ను మాత్ర‌మే చీల్చుతుంది. బీజేపీ వ్య‌తిరేకులంతా ఎలాగూ టీడీపీ వైపు ఉంటారు.

 

కాబ‌ట్టి ఎటువైపు చూసినా.. సంప్ర‌దాయ ఓట‌ర్లున్న టీడీపీ 40శాతం ఓట్లు  గ్యారంటీ. పైగా 59 స్థానాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా దేశం పార్టీదే విజ‌యం.. కాబ‌ట్టి.. వైసీపీ ఆరోప‌ణ‌లు నీటిమీద రాత‌లు. జ‌న‌సేన‌తో టీడీపీ ఓట్లు చీల‌వు. బీజేపీకు దూరం కావటం వ‌ల్ల మైనార్టీలు, క్రైస్త‌వుల ఓట్లు సైకిల్ గుర్తుకే అంటూ ధీమాగా చెబుతున్న చంద్ర‌బాబు గ‌ణం.. లెక్క‌లు టీడీపీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. దీనికి అద‌నంగా కేంద్రంలో కూట‌మి కి రూప‌మిచ్చే ప‌నిలో బాబు నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో హ‌స్తం పార్టీ నుంచి స‌హ‌కారం అందుతుంది. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు దేశం.. ఏపీలో దేశం పార్టీకు హ‌స్తం మ‌ద్దతు ఉండ‌నే ఉంద‌నేది.. తెలుగు త‌మ్ముళ్ల భ‌రోసా. ఏమైనా.. లెక్క‌లు మ‌స్త్‌గున్నాయి.  ఎన్నిక‌ల్లో కూడా ఇవే లెక్క‌లు ఫైన‌ల్ అయితే.. అప్పుడు నిజ‌మే అనుకోవాలంటూ.. విపక్షాలు విసుర్లు సంధిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.