జ‌గ‌న్ అవ‌గాహ‌న రాహిత్యం !

ఒక యువ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే మంచిదే.
కానీ అత‌నికి ప‌రిపాల‌న శ‌క్తి-సామ‌ర్థ్యాలు అవ‌స‌రం.
ఒక యువ‌కుడు ప్ర‌తిప‌క్ష నేత అయితే మంచిదే.
కానీ అత‌నికి వ్య‌వ‌స్థ‌ల‌పై క‌నీస గౌర‌వం, అవ‌గాహ‌న ఉండాలి.
ఒక యువ‌కుడు ప్ర‌జ‌ల కోసం పోరాడితే మంచిదే.
కానీ అత‌ని ప్ర‌వ‌ర్త‌న ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా ఉండొద్దు.
… కానీ మ‌న ప్రియ‌త‌మ ప్ర‌తిప‌క్ష‌నేత కేవ‌లం రాజ‌కీయ యువ‌కుడు. కానీ… పైన చెప్పిన ఏ లక్షణాలూ లేవు. అస‌లు అన్నింటి కంటే ముఖ్యంగా వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేదు. ఒక రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత ఆ రాష్ట్ర పోలీసుల‌ను ఒక కేసులో అనుమానించారు. అనుమానించ‌డం కాదు త‌ప్పు. అస‌లు పోలీసులు విచార‌ణే ప్రారంభించ‌ని కేసుపై అనుమానించ‌డం త‌ప్పు. ఈ క‌నీస విష‌య ప‌రిజ్ఞానం లేని జ‌గ‌న్ ఈరోజు కోర్టుకు లాయ‌ర్‌ను పంపి హైకోర్టు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నోరెళ్ల బెట్టాడు. ఒక ప‌ని చేసేట‌పుడు దూర‌దృష్టి ఉండాలి. దాని విప‌రిణామాలు, ప్ర‌యోజ‌నాలు ఆలోచించాలి. భ‌విష్య‌త్తులో తాను మ‌రోస్థానంలో ఉన్న‌పుడు ఈ ప్ర‌వ‌ర్త‌న ఎదుర‌యితే ఇదే ప‌రిస్థితి ఎలా ఉంటుందన్న భావి విశ్లేష‌ణ ఉండాలి. ఇవేవీ ఆలోచించ‌రు గాని రెండు మూడు కులాలు అండ‌గా ఉన్నాయి కాబ‌ట్టి, ప్ర‌జ‌లు అడిగారు కాబ‌ట్టి ముఖ్య‌మంత్రి కుర్చీ కావాలి. ఇది రాష్ట్ర దుస్థితి. ఈరోజు జ‌గన్ పిటిషన్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు జగన్‌ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిని గ‌మ‌నిస్తే మ‌న‌కు కొన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతాయి.
ప్ర‌శ్నలు
1. దాడి జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు..?
2. విశాఖ నుంచి వెంటనే విమానంలో హైదరాబాద్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..?
3. ఏపీ పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదు..?
4. అసలు గాయంతో విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అన్న దానిపై వివరాలు తెలుసుకుని తమకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను సీల్డ్‌ కవరులో ఉంచి సమర్పించాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే… మ‌రీ దారుణంగా అది కోర్టు అనే విచ‌క్ష‌ణ లేకుండా *ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే జగన్‌ వాంగ్మూలం ఇవ్వలేదు* అని జగన్‌ న్యాయవాది కోర్టుకు తెల‌ప‌డం విచిత్రం. పైగా జగన్‌పై దాడి కేసును రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు.
ఇక్క‌డ మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌య ఏంటంటే… ప్ర‌జ‌లు దీనిని ఎలా అర్థం చేసుకుంటార‌న్న అవ‌గాహ‌న్ మ‌న ప్ర‌తిప‌క్ష నేత‌కు లేదు. ఈ ట్రెండ్ ప్ర‌జ‌లు అల‌వాటు చేసుకుంటే రేపు పొద్దున ఏ రాష్ట్రపు కోర్టులు ఆ రాష్ట్రంలో పెట్ట‌కుండా ప‌క్క రాష్ట్రాల్లో పెట్టాల్సి వ‌స్తుంది. జ‌య‌లలిత విష‌యంలో కూడా ఇది జ‌రిగింది. శ‌శిక‌ళ‌, జ‌య‌ల‌లిత విష‌యంలో ఇలా జ‌రిగింది. అయితే… చాలా కాలం త‌ర్వాత విచార‌ణ తీరుపై అనుమానాలు రావ‌డంతో ప‌క్క రాష్ట్రం అడిగారు. కానీ ఒక చిన్న గాయానికి ప‌క్క రాష్ట్ర పోలీసులు కావాలంటే… భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌లు ఇదే ప్ర‌శ్న వేస్తే ప్ర‌భుత్వం ఎలా స్పందించాలి?
అందుకే నాయ‌కుడికి సామాజిక ప‌రిజ్ఞానం, రాజ్యాంగంపై అవ‌గాహ‌న‌, లా అండ్ ఆర్డ‌ర్‌పై గౌర‌వం, రాష్ట్రంపై ఆపేక్ష ఇలాంటివి ఉండాలి. లేక‌పోతే వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతాయి.

1 Comment

  1. జగన్, పవన్ ఇద్దరూ అవగాహనా రాహిత్యం, అనుభవ రాహిత్యం గలవారే. వారు తీసుకునే నిర్ణయాలే ఆ విషయం చెప్పకనే చెబుతాయి. ఇటువంటి వీరిద్దరు ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం అత్యాశే.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.