జగన్‌కు అదిరిపోయే షాకిచ్చిన హైకోర్టు

ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్ని రోజులూ అన్ని పార్టీలు రాజకీయాలు నడిపినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దాడి తర్వాత ఉధృతం అయ్యాయి. ఈ దాడి చేసిన వ్యక్తి జగన్‌పై అభిమానంతోనే చేశానని చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారు. టీడీపీనే ఈ దాడిని చేయించిందని ఒకరంటే.. కాదు.. ప్రభుత్వం వల్లే జరిగిందని మరొకరు అంటున్నారు. ఒకవైపు ఏపీ పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నా వైసీపీ నేతలు మాత్రం విమర్శలు ఆపడంలేదు. ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఇక జగన్‌ అయితే ఒకడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. నిందితుడు తాను వైసీపీ అధినేత అభిమానినని, ఆయనకు సానుభూతి వస్తుందనే ఈ దాడి చేశానని స్వయంగా చెప్పినా.. జగన్ కోర్టుకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు జగన్‌కు అదిరిపోయే షాకిచ్చింది.

తనపై దాడి జరిగిన తర్వాత మీడియా ముందుకు రాకుండా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నాడు వైసీపీ అధినేత. ఆయన వేసిన పిటిషన్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే, శుక్రవారం హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. అంతేనా.. జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆక్షేపించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. దీంతో వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నాయకుల నోళ్లకు మూతలు పడినట్లు అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం లేదని చెప్పడంతో అప్పట్లోనే జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనికి కోర్టు కూడా మద్దతు తెలపడం పోలీసులకు బూస్టునిచ్చింది. కోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ తప్పకుండా ఏపీ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల వైసీపీ అధినేతకే ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.