బాలకృష్ణ కోసం క్యూ కడుతున్న అందాల భామలు!

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణతో జతకట్టేందుకు అందాల భామలంతా ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. అప్పట్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమ్రాన్ లాంటి ఎందరో బ్యూటిఫుల్ హీరోయిన్స్ బాలకృష్ణతో చిందులేయగా.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ కూడా బాలయ్యబాబుతో డాన్సులేయటానికి రెడీ కావటం నందమూరి ఫ్యాన్స్ కి అమితానందాన్నిస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందాల భామలు బాలయ్యబాబుతో రొమాన్స్ చేసేందుకు ఓకే అంటున్నారు. మొన్నటి వరకూ విద్యాబాలన్ మాత్రమే అనుకుంటే.. ఆ లిస్ట్‌లో రకుల్‌ప్రీత్ సింగ్, నిత్యామీనన్, పాయల్ రాజ్‌పుత్ చేరగా తాజాగా బ్యూటీ హన్సిక కూడా చేరిపోవటం నందమూరి అభిమానులను ఆనంద పరుస్తోంది. దీంతో అందాలన్నీ బాలయ్యబాబు చుట్టే అని జోరుగా చెప్పుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.

ఇక ఈ పాటికే మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామో, అసలు విషయమేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. అదేనండీ! క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’బయోపిక్‌లో నందమూరి నాయకుడి సరసన మెరిసేందుకు అందాల భామలు ఒకరివెంట ఒకరు సై అంటున్నారు. స్వయంగా నిర్మాణ భాద్యతలు చేపట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని రూపొందిస్తున్నారు బాలయ్యబాబు. ‘కథానాయకుడు, మహానాయకుడు’అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో.. ఎన్టీఆర్ జీవితంలోని ఏ ఒక్క సంఘటనను వదలకుండా ఉండేలా ప్లాన్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన హీరోయిన్స్ అందరినీ ఇందులో చూపించటానికి భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నారు.

రానా, సుమంత్ వంటి యంగ్ కుర్రాళ్లతో పాటు యంగ్ హీరోయిన్స్ అందరినీ ఈ బయోపిక్‌లో భాగం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీదేవిగా రకుల్, సావిత్రిగా నిత్యామీనన్, జయసుధగా పాయల్ రాజ్‌పుత్‌ కన్ఫర్మ్ కాగా.. జయప్రదగా నటించేందుకు హన్సికను ఇటీవలే కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ సంక్రాంతికి యంగ్ హీరోయిన్లతో బాలయ్యబాబు వేసే చిందులు థియేటర్లను గోల పెట్టేయనున్నాయన్న మాట. ఆనాటి సూపర్ హిట్ సాంగ్స్, వాటిలో యంగ్ భామలతో బాలయ్య స్టెప్పులు.. అబ్బో ఊహించుకుంటేనే సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆత్రుత రెట్టింపవుతోంది! కదండీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.