మ‌రో ఆంధ్రుడిని తెగ‌పొగిడిన హరీష్‌రావు

ప్ర‌పంచంలో అన్ని దేశాల్లో అన్ని దేశాల ప్ర‌జలు ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉంటారు. చివ‌ర‌కు తెలుగు వాళ్లు అమెరికా వంటి కంట్రీల‌కు వెళ్లి ఐదారేళ్ల‌లోనే గ్రీన్ కార్డులు ఓటు హ‌క్కులు పొందిన వారు కూడా ఉన్నారు. అలాగే ఏకంగా ఎన్నిక‌ల్లో గెలిచిన వారు కూడా ఉన్నారు. కానీ ఎక్క‌డా లేని ఒక వివ‌క్ష‌ను కేవ‌లం రాజ‌కీయం కోసం క్రియేట్ చేశారు తెలంగాణ నాయ‌కులు. ఇపుడు దానితో అత్య‌ధికంగా బాధ‌ప‌డుతున్నది కూడా వారే.
ఆంధ్రుడు అనే ప‌దాన్ని బూతు ప‌దంగా మార్చిన టీఆర్ఎస్ నేత‌ల‌కు తెలంగాణ కోరిక తీరాక ఆ సెంటిమెంట్‌ ఎన్నిక‌లు ముగిశాక‌.. వ‌చ్చిన ఈ రెండో ఎన్నిక‌లు చుక్కలు చూపిస్తున్నాయి. ఇపుడు సెంటిమెంట్ పండ‌టం లేదు. ఏం చేసినావో చెప్పు అంటున్నారు. దీంతో ఆంధ్రోడితో అయితే ఈ పేచీలేదు. ప్రేమిస్తే ఓటేస్తాడు. అదే తెలంగాణ వాడికి ఇచ్చిన హామీల‌కు స‌మాధానం చెప్పాలి. అన‌వ‌స‌రంగా వారిని తిట్టి దూరం చేసుకున్నామే అని బాధ‌ప‌డుతున్న‌ది టీఆర్ఎస్ ద‌ళం.
ఇన్నాళ్ల‌కు టీఆర్ఎస్ పార్టీకి అర్థ‌మైన నీతి ఏంటంటే… ఇంకో 10-15 సంవ‌త్స‌రాలు ఆంధ్ర ఓటర్లు తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తూనే ఉంటారు. అయితే, దీనికి కార‌ణంగా కేసీఆర్ ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరే. త‌ప్పు జ‌రిగాక నాలిక క‌ర‌చుకుని ఏం లాభం. అందుకే అస‌లు ఆంధ్ర వారిని మాకంటే మించి ప్రేమించే వారు ఎవ‌రూ లేర‌ని గ‌ప్పాలు కొట్టుకుంటున్నారు. తాజాగా హ‌రీష్ రావు మ‌రో ఆంధ్రుడిని తెగ పొగిడారు.

ఈ రోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో భక్తి టీవీ ఛానెల్ అధినేత నిర్వ‌హిస్తున్న‌ కోటి దీపోత్సవం కార్యక్రమంలో హ‌రీష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి తాను వచ్చానని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్టీవీ చౌదరిని చూస్తుంటే ఆయన ఆధ్యాత్మిక ఉద్యమకారుడిగా మారినట్టు అనిపిస్తోందని ప్రశంసించారు. అటు ప్రభుత్వం సాయం గానీ, ఇతరుల నుంచి కానీ ఎటువంటి సహకారం తీసుకోకుండా ఆయన, ఆయన కుటుంబసభ్యులు, వారి సిబ్బంది ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఆయనపై భగవంతుడి కృప ఉందని అన్నారు. ఈ మాట‌లు విన్న ఆంధ్రుల కంటే తెలంగాణ వారు ఎక్కువ విస్మ‌యం చెందారు. ఎందుకంటే ఎనిమిదేళ్లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాన‌ని చెప్పిన హ‌రీష్‌… ఎపుడూ లేని ఇపుడే ఇలా ఎందుకు పొగిడాడో మాకు తెలుసులే అని వ్యంగాలు విసిరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.