హ‌రీష్‌రావును.. ప‌క్క‌న బెట్టారా..  వెన‌క్కి నెట్టారా!

గులాబీ పార్టీలో ఏ ప‌రిణామం చోటుచేసుకున్నా.. వ్యూహాల‌కు ప‌ద‌నుపెట్టినా.. హ‌రీష్‌రావు ఉండాల్సిందే. కానీ.. కొంగ‌ర‌క‌లాన్‌లో టీఆర్ఎస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సెప్టెంబ‌రు 2న త‌ల‌పెట్టిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో అడ్ర‌స్ లేకుండా పోయారు. క‌నీసం ఏపోస్ట‌రులో.. ఏ ఫ్రేమ్‌లోనూ.. హ‌రీష్ ముఖం క‌నిపించిన దాఖ‌లాల్లేవు. ఇదంతా కావాల‌నే చేస్తున్నారా.. లేక‌పోతే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పనుల్లో బిజీగా వున్న ఆయ‌న్ను క‌ద‌ప‌టం ఎందుకుని పార్టీ అధినేత కేసీఆర్ భావించారా.. అనేది పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయ‌ట‌. 2019 ఎన్నిక‌లు.. సారీ.. 2018 న‌వంబ‌రు, డిసెంబ‌రులోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు దాదాపు కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. బీజేపీ నేత‌ల‌ను.. కేంద్రంలోని పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్నారు. ఇంకేముంది.. ఎలాగూ.. కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయం కాదు.. స‌ర్లే టీడీపీ అంటే.. ఒంట‌రిగా నెగ్గ‌లేదు. ఈ రెండు పార్టీలు క‌లిస్తే.. అమ్మో. అందుకే.. ఈ ముంద‌స్తు ముచ్చ‌ట‌. మ‌రి ఇటువంటి స‌వాళ్ల స‌మ‌యంలో ముద్దుల మేన‌ల్లుడు.. ఎక్క‌డా.. అంటే..  ఎవ‌రూ స్పందించ‌ట్లేదు. హ‌స్తం పార్టీనేత‌లైతే.. ఎన్నిక‌ల నాటికి హ‌రీష్‌రావు.. కాంగ్రెస్ పార్టీలోకి చేర‌టం ఖాయ‌మంటూ ఏనాడో తేల్చిచెప్పారు.
ఇదే భ‌యం టీఆర్ఎస్ నేత‌ల‌ను వెంటాడుతుండ‌టం వ‌ల్ల‌నే హ‌రీష్‌ను ప‌క్క‌న ఉంచారా అనే అనుమానాలు కూడా బ‌ల‌ప‌డుతున్నాయి. వాస్త‌వానికి క‌విత‌, కేటీఆర్‌, హ‌రీష్ మ‌ధ్య వార‌స‌త్వ పోరు త‌ప్ప‌ద‌నే సంకేతాలు.. గులాబీ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచే ఉంది. ఇప్పుడు.. అది క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ వ‌స్తోంది. దీనికి కీల‌క‌మైన వ్య‌క్తి.. క‌విత‌. నిజామాబాద్ నుంచి ఈ సారి.. ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తుంది. దానికోస‌మే త‌న‌కు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం కావాలంటూ పోరాడుతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే జ‌గిత్యాలపై క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగానే.. త‌న‌కు ప్ర‌త్య‌ర్థి లేకుండా చేసుకునేందుకు పాపం.. కాంగ్రెస్ నుంచి గులాబీ కండువా క‌ప్పుకునేందుకు వ‌చ్చిన డి.శ్రీనివాస్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. పైగా.. డి. శ్రీన‌వాస్ త‌న‌యుడు సంజ‌య్‌పై విద్యార్థినుల వేధింపుల కేసు బ‌నాయించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో డీఎస్ .. కేసీఆర్‌తో క‌టీఫ్ కొడ‌తార‌నేంత వ‌ర‌కూ చేరింది. ఇటీవ‌ల జ‌రిగిన మీటింగ్‌కు డీఎస్ రాగానే కేసీఆర్ స‌మావేశం ముగించార‌ట‌. దీంతో.. క‌విత‌కు రూట్ దాదాపు క్లియ‌ర్ అయిన‌ట్లే. ఇక‌పోతే.. కేటీఆర్‌.. రేప‌టి ఎన్నిక‌ల త‌రువాత‌.. కేసీఆర్‌ కేంద్రంలో చ‌క్రం తిప్పితే.. కేటీఆర్ తెలంగాణ ఏలిక అవుతార‌నే అంచ‌నాలున్నాయి. వీట‌న్నింటి మ‌ధ్య‌.. హ‌రీష్ పోటీగా మారితే.. చెక్ చెప్ప‌టం క‌ష్టం. ఎందుకంటే.. హ‌రీష్‌రావును పార్టీ చాలా అభిమానిస్తుంది. ఆయ‌న‌కంటూ.. తెలంగాణ‌లో ప్ర‌త్యేక కేడ‌ర్ ఉంది. ఇటువంటి స‌మ‌యంలో హ‌రీష్‌ను.. ఎలా సైడ్ చేస్తార‌నేది టీఆర్ఎస్‌లో మ‌రో వ‌ర్గం సందేహం. ఎన్ని అనుకున్నా.. హ‌రీష్ ప్రాధాన్య‌త ప‌రిమితం చేస్తున్నార‌నేది మాత్రం.. ఫైన‌ల్‌!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.