హ‌రీశ్‌ రావును పొగిడిన కేటీఆర్‌

తెలంగాణలో ఆ ఇద్ద‌రు మంత్రులు కీల‌క స్థానాల్లో ఉన్నారు. ఒక‌రు సీఎం కేసీఆర్‌కు కుమారుడు కేటీఆర్ అయితే మ‌రొక‌రు మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు. ఉద్య‌మం స‌మ‌యంలో హ‌రీశ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌రువాత వ‌చ్చిన కేటీఆర్ కూడా తండ్రికి త‌గ్గ త‌నయుడు అనిపించుకున్నాడు. రాష్ట్రంలో కీల‌క నిర్ణ‌యాల వెనుక వీరిద్ద‌రు కూడా చాలా క‌స‌ర‌త్తుచేస్తార‌నేది అధికారికంగా అంద‌రికి తెలుసు. కాని తెర వెనుక ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు తారాస్థాయిలో ఉంటాయ‌ని కొంత మంది సీనియ‌ర్‌లుఅంటుంటారు. ఈ మ‌ధ్య ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎలాంటి స‌మ్మె జ‌రిగిన దాని వెనుక హ‌రీశ్ హ‌స్తం ఉంద‌నే పుకార్తు వినిపిస్తున్నాయి. హ‌రీశ్ సొంతంగా పార్టీ పెడుతున్నాడ‌ని కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌చేసింది. దీనికి హ‌రీశ్ స్వ‌యంగా ఖండ‌న ఇచ్చుకోవాల్సిన‌ప‌రిస్థితి ఎదురైంది. ఇలాంటి ప్ర‌చారం కేటీఆర్ వ‌ర్గం చేయిస్తుంద‌ని హ‌రీశ్ అనుచ‌రులు అనుకుంటుంటారు. అయితే తాజాగా టీఎస్ ఆర్టీసీ స‌మ్మె వెనుక హ‌రీశ్‌రావు మంత్రాంగం ఉంద‌ని పార్టీకి చెందిన‌నాయ‌కులే చెప్పుకున్నారు.ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డానికి హ‌రీశ్ స్వ‌యంగా కార్మిక సంఘాల‌ను ఉసిగొల్పార‌ని చెప్పుకున్నారు. హ‌రీశ్ విష‌యంలో కేసీఆర్ వైఖ‌రి మార‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇన్నిరోజులు జ‌రిగిన‌ప్ర‌చారం తా అబ‌ద్ద‌మే అన్న‌ట్టుగా కేటీఆర్ ఓ స‌మావేశం హ‌రీశ్‌ను పొగిడారు. ఆర్టీసీ కార్మిక సంఘాల‌తో ఆదివారం స‌మావేశం ఏర్పాటు చేశారు.

 

ఇందులో కేటీఆర్‌, హ‌రీశ్‌రావుతోపాటు మ‌రో ఐదుగురు మంత్ర‌లు పాల్గొన్నారు. కార్మికుల‌తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాక కేటీఆర్ త‌న మాట‌ల్లో హ‌రీశ్‌రావు పొగిడారు. కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. గతంలో 43శాతం ఫిట్మెంట్ కోరితే 44శాతం ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగాక, అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కూడా కల్పించారని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కార్మికులకు కేసీఆర్ అండగానే ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ సంఘాలతో ఏడుగురు మంత్రులం చర్చించామని కేటీఆర్ చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చలు సఫలం కావడం కోసం మంత్రి హరీశ్ రావు ఓ వైపు కార్మిక సంఘం నేతగా, మరో వైపు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని ప్రశంసించారు. సమ్మె విరమణ చేయించి సుఖాంతం చేశారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్య‌లు ఇప్పుడుపార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇన్ని రోజులు జ‌రిగిన ప్ర‌చారం అంతా అబ‌ద్ద‌మే…అన‌వ‌రం ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌నుకున్నాం అంటూ ఓ సీనియ‌ర్ నేత చెప్పుకొచ్చాడు. ఎన్నిక‌ల వేళ ఆ మాత్రం ఐక‌మ‌త్యం చూపించ‌క‌పోతే ప్ర‌తిప‌క్షాల‌చేతికి అస్త్రం ఇచ్చిన‌ట్టు అవుతుంది అనే లాజిక్‌రుపాపం ఆ నేత మ‌రిచిపోయాడు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.