టైగ‌ర్ శీత‌య్య‌.. నిజంగా టెర్ర‌రేన‌ట‌!

హ‌రికృష్ణ‌… ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం మాజీ మంత్రిగా.. రామారావు కుమారుడిగా మాత్ర‌మే అంద‌రికీ తెలుసు. కానీ.. అంత‌కు మించిన‌.. స్నేహితుడు.. గొప్ప మాన‌వ‌తావాది అని ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత ప్ర‌పంచానికి తెలుస్తుంది. వై.వి.చౌద‌రి తీసిన శీత‌య్య సినిమా నూరుపాళ్లు హ‌రి అన్న‌కు సూటబుల్ పాత్ర అంటారాయ‌న‌. నీతి, నిజాయ‌తీల్లో హ‌రికృష్ణ త‌రువాత‌నే ఎన్‌టీఆర్ అయినా అంటూ పోసాని కృష్ణ‌ముర‌ళి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా భుజం త‌ట్టి ప్రోత్స‌హించే నైజం ఆయ‌న‌ది. అయితే.. కోపంలో మాత్రం.. ఎవ‌రూ స‌రిపోర‌ట‌. త‌న‌కు న‌చ్చ‌ని ప‌ని.. ప‌దిమందికి ఇబ్బంది క‌లిగే ప్ర‌వ‌ర్త‌న‌ను అస‌లు స‌హించ‌ర‌ట‌. పైగా.. త‌ప్పు చేసిన వారి విష‌యంలో చండ‌శాస‌నుడుగా మార‌తాడ‌ట‌. ఒక్క‌సారి కోపం రుచిచూసిన వారికి.. ఆయ‌న క‌ళ్ల‌లో చూసి మాట్లాడేందుకు భ‌య‌ప‌డ‌తార‌ట‌. అంత‌టి టెర్ర‌ర్ పుట్టించే టైగ‌ర్ వాస్తవానికి చాలా సున్నిత‌మైన మ‌న‌సుగ‌ల‌వాడు. 1982లో చైత‌న్య‌ర‌థ యాత్ర‌లో తండ్రి త‌ల‌కు చిన్న‌పాటి గాయ‌మైతే.. విల‌విల‌లాడిపోయారంటూ గుర్తుచేసుకుంటున్నారు. సంప్ర‌దాయాల‌ను గౌర‌వించే హ‌రికృష్ణ తెలుగు భాష‌ను అమితంగా ప్రేమించేవార‌ట‌.
2008లో రాజ్య‌స‌భ స‌మావేశాల్లో తెలుగులో మాట్లాడ‌తానంటూ బీష్మించుకున్నారు. ఇదే విష‌యాన్ని నాటి ఎంపీ.. ఇప్ప‌టి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుతో పంచుకున్నార‌ట‌. డ్రైవింగ్ అంటే చాలా ఇష్ట‌ప‌డే హ‌రికృష్ణ‌కు.. ఒక న‌మ్మ‌కం కూడా ఉంద‌ట‌. అదేమిటంటే.. ఎవ‌రైనా డ్రైవ‌ర్‌గా త‌న వ‌ద్ద‌కు వ‌స్తే.. వారి న‌క్ష‌త్రం, జాత‌కాలు చూసేవార‌ట‌. వారికి డ్రైవింగ్ వ‌ల్ల ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని గుర్తించినా.. సిద్ధాంతులు వ‌ద్ద‌ని వారించినా.. వారికి నెల‌జీతం ఇచ్చి వెళ్లిపోమ్మంటార‌ట‌. మొన్న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కేవ‌లం.. రోడ్డుపై ఉన్న బండ‌రాయి టైర్‌కు త‌గ‌ల‌టం.. అదుపు చేసే అవ‌కాశం లేకుండా.. 100 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం.. ఇవ‌న్నీ ఆయ‌న్ను ప్ర‌మాదానికి చేరువ‌చేశాయి. సీటు బెల్టు పెట్టుకోకపోవ‌టం కూడా తీవ్ర‌త‌ను పెంచింది. ఒక మామూలు మాజీ మంత్రి, సినీన‌టుడు మ‌ర‌ణిస్తే.. వేలాదిమంది హైద‌రాబాద్ రావ‌టం.. హ‌రికృష్ణ‌ను..  ఎన్‌టీఆర్‌తో పోల్సుకోవ‌ట‌మే కార‌ణ‌మంటున్నారు అభిమానులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.