ప్రతి కొడుకు చదవవలసినది.

నేటితరం ఎందరికో నందమూరి హరికృష్ణగారు ఒక సాధరణ రాజకీయనేతగానో లేక కొన్ని సినిమాలలో నటించిన నటుడిగానో లేక అన్నగారు NTR తనయుడిగానో తెలుసుండొచ్చు… కొంతమంది ఒక ఫెయిల్యూర్ సన్ అని అవహేళన చేయొచ్చు. But, he born to the Legend and he gave birth to the Legend.

కానీ హరికృష్ణగారిలో తెలిసిన మరొక కోణం – తన తండ్రిని అమితంగా ప్రేమించే ఒక అద్బుతమైన కొడుకు.

* తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా దేశంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగినా కొటాను కోట్లు కూడ పెట్టుకోటం చేతకాని అమాయకపు కొడుకు.
* తన తండ్రికోసం తన 30 ఏళ్ల జీవితం అంకితం చేసి తండ్రికి రక్షణ గా తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నకొడుకు.
* తన తండ్రికోసం లక్ష కిలోమీటరులు ప్రచారవాహనం (చైతన్యరథం) నడిపిన రథసారథి.
* రోజుకు కేవలం 6 గంటలు రెస్ట్ తీసుకుంటూ వెన్నెముకనొప్పితో బాధ పడ్డా, కాళ్లకి బొబ్బలుకట్టినా చైతన్యరథం steering ని వదలని stubborn పర్సనాలిటీ.
* పెళ్ళై పిల్లలున్నా వారి అచ్చటముచ్చట చూసే అవకాశాన్ని తన తండ్రితో గడపటంకోసం త్యాగం చేసిన తండ్రి పిచ్చోడు.
* కోడికూయక మునుపే తండ్రిని మేలుకొలిపి నగరం నిద్రపోయాక తన తండ్రి తరువాత నిదురించే కొడుకు.
* తన కంటే బాగా తన తండ్రిని వేరెవరు అంత బాగ చూసుకోలేరేమో అనే సందేహంతో నిత్యం శివునికి నందిలా తండ్రి చేయి వీడని కొడుకు.
* తండికి జీవితాంతం రుణపడున్న కొడుకులు ఎందరో ఉంటారు.. కొట్లమందికి ఆరాధ్యుడైన తన తండ్రి తనకే రుణపడేలా చేసుకున్న ఆయన నడవడిక ప్రతి కొడుకుకి స్పూర్తిదాయకం.

తండ్రిని అందరు ప్రేమిస్తారు ఆరాధిస్తారు… అతని లా తండ్రిసేవలో తరించి తండ్రిని ప్రాణసమానంగా పూజించటం నేటితరంలో ఎవరికి సాధ్యం కాదు…
అందుకే
ఒక సుప్రీం జడ్జ్
ఉప రాష్ట్రపతి
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఒక గవర్నర్,
మూడు రాష్ట్రాల కాబినెట్ మినిస్టర్స్,
MLA లు, ఎంపీలు
వందల మంది రాజకీయ నాయకులు నటులు ప్రముఖులు
వేలాది అభిమానుల కన్నీళ్ళు

చెప్తుంది….అతని ప్రయాణం లొని లొతు అతని జీవితం లొని కమిట్మెంట్.

Your soul May Rest In Peace Sri Nandamuri Hari Krishna. 🙏🙏🙏

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.