మోడీని డ్యామేజ్ చేసిన జీవీఎల్

అదేంటి… ఆయ‌న మోడీ న‌మ్మిన బంటు. అత‌ను మోడీని డ్యామేజ్ చేయ‌డం ఏంటి? అది కూడా ఏపీ టూర్‌లో అదెలా ? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా. నిజ‌మే… ఏపీ విభ‌జ‌న హామీల‌లో మోడీ చేసిన మోసం వ‌ల్ల చంద్ర‌బాబు దూరం జ‌ర‌గడంతో ఎపుడో ఢిల్లీ వెళ్లి స్థిర‌ప‌డిన జీవీఎల్‌కు ఒక మంచి అవ‌కాశం ఇచ్చింది బీజేపీ. పేరుకు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. కానీ అత‌ను ఉద్యోగం చంద్ర‌బాబు విమ‌ర్శ‌కుడు.
పొద్దున లేచిన వెంట‌నే అన్ని పేప‌ర్లు తిర‌గేయ‌డం. చంద్ర‌బాబు వార్త‌లు నోట్ చేసుకోవ‌డం. సాయంత్రం వ‌ర‌కు క‌నిపించిన వారికి, క‌నిపించ‌ని వారికి చంద్ర‌బాబును తిడుతూ ఉండ‌టం. పాపం ఈ ప‌నిచేయ‌డానికే ఆయన్ను ఢిల్లీ నుంచి విజ‌య‌వాడ షిఫ్ట్ చేసింది బీజేపీ అధిష్టానం. అయితే, అత‌నిలో విష‌యం లేద‌ని ఎపుడో తేలిపోయింది. జీవీఎల్ చేసే చాలా విమ‌ర్శ‌ల‌ను కుటుంబ‌రావు క‌డిగి పారేసి అత‌ని అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టాడు. అదంతా ఒకెత్తు. తాజాగా మోడీ జీవీఎల్‌కు ఒక మంచి అవ‌కాశం ఇచ్చారు. త‌న ప్ర‌సంగాలు త‌ర్జుమా చేసే ప‌ని ఈరోజు జీవీఎల్‌కు అప్ప‌గించారు. అంతే… పాపం మోడీ వేసిన ప్లాన్ల‌న్నీ తిర‌గ‌బ‌డిన‌ట్ట్యింది. అస‌లే ఏపీ వాళ్లు హిందీలో చాలా పూర్. తెలుగులో జీవీఎల్ పూర్.. ఈవిష‌యం తెలియ‌ని అధిష్టాం జీవీఎల్‌కు చేత‌కాని ప‌ని అప్ప‌గించింది. ఇక ఆయ‌న త‌ఢాఖా చూపించారు ఈరోజు.
మోదీ మంచి మాట‌కారి. త‌న‌దైన శైలి వాగ్బాణాలు వేయ‌డంలో దిట్ట‌. ఎందుకంటే అత‌నికి అదే వ‌చ్చు. ఈరోజు చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై విరుచుకుప‌డితే… ఆ మాట‌ల‌ను అచ్చ తెలుగులో చెప్పేందుకు జీవీఎల్ తంటాలు ప‌డ్డారు. మోదీ చెప్పింది ఒక‌టైతే… జీవీఎల్ వినిపించింది మ‌రోటి అన్న‌ట్టుగా సాగింది త‌ర్జుమా. మోదీ స్వ‌ర గాంభీర్యం, ప్రాస‌, చుర‌క‌లను చేవ లేవి తెలుగీక‌ర‌ణ‌తో జీవీఎల్ చంపేశారు. ఇక‌పై తెలుగు అనువాదం అంటేనే ఏవ‌గింపు క‌లిగించే రీతిలో జీవీఎల్ వ్య‌వ‌హ‌రించారు. ఇకపై ఏరోజూ జీవీఎల్‌కు ఆ బాధ్య‌త అప్ప‌గించొద్ద‌ని పీఎం మోడీ ఆఫీసు అధికారులు సాయంత్రం ఏపీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశార‌ట‌. విచిత్ర‌మేంటంటే సోష‌ల్ మీడియాలోనూ జీవీఎల్ తెలుగుపై సెటైర్లు పేలుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.