ఎన్నికల బరిలో ఆదర్శ నాయకుడు.. గెలిపిస్తారా..?

తెలంగాణలో ఎన్నికల హడావిడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఒకవైపు.. మిగిలిన పార్టీలన్నీ మరోవైపు ఉండి ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సై అన్నారు. దీనికి ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థలు ప్రచారాన్ని మొదలు పెట్టేయగా, ప్రతిపక్షాల్లోని కొన్ని పార్టీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడగా.. సీపీఎం కూడా బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఎమ్‌ఐఎమ్, భారతీయ జనతా పార్టీ సహా మిగిలిన పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తన నిజాయితీతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఓ నేత ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ఆయనే సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఈ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్యను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి డీవీ కృష్ణ తెలిపారు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నరసయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు. చివరిగా ఆయన 2004 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత పోటీ చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. సామాన్యుడిలా బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేయడం.. పూరిట్లో జీవించడం ఆయనే చెందింది. అలాంటి నేత మరోసారి పోటీకి సిద్ధమవుతుండడంతో ఈయన హాట్ టాపిక్‌గా మారారు. ఇలాంటి నిజాయితీ గల నేతను ఈరోజుల్లో ప్రజలు ఆదరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.