గవర్నర్ హస్తినకు అందుకే వెళ్లారంట…

సిఎం చంద్రబాబుతో మాట్లాడిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అంతే ఢిల్లీ బయల్దేరి వెళ్లారాయన. సిఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీతో పెట్టుకుంటే ప్రమాదంలో పడతావని హెచ్చరించారు గవర్నర్‌‌. మంత్రి అచ్చెన్నాయుడు ఇదే మాట ప్రస్తావించారు. ఫలితంగా మసాలానూరి ప్రధాని మోడీకి చెబుతారా లేక వాస్తవం చెబుతారా అనేది తెలియదు. కానీ గవర్నర్ మాటలను బట్టి కేంద్రం వ్యూహ రచన ఉండే వీలుంది. రెండు రోజుల పాటు గవ్నరర్ ఢిల్లీలో మకాం వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన, రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారాయన. 
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశమైన గవర్నర్‌‌ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా సమస్యలు, ఇతర అంశాలను వారికి వివరించనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ పై పాజిటివ్ గానే ఉన్న గవర్నర్.. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై పోరుబాట పట్టడంతో గవర్నర్‌ ఢిల్లీ టూర్‌  ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది.  
కేంద్ర ఐబీ అధిపతి, ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాయి. కేంద్రానికి నివేదికలు ఇచ్చాయి. మరోవైపు బీజేపీతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల నుంచి సమాచారం తెప్పించుకుంది కేంద్రం. ఏపీలో ఉన్న పరిస్థితులపై ఎక్కువగా ఆరా తీసింది కేంద్రం. చంద్రబాబు పనితీరు. చేసిన పనులు, ఇందులో అక్రమాలకు ఆస్కారం ఉన్న సంగతులను పరిశీలిస్తోంది. వీలుంటే చంద్రబాబుపై కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్రంతో కయ్యానికి దిగారు చంద్రబాబు. అందుకే ముక్కుతాడు వేసేందుకు వారు సిద్దమవుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.

2 Comments

  1. Vinasakale vipareeta Budhi. Modi, shah 2019 lo finish avutaru. Endukante CBN ni finish chestanu ani Rajasekhar Reddy finish ayadu. Tirupati Venkana chala powerful. Ap prajalaki anyam cheste Sarva nasanam chestadu

  2. తన మాట వినని ముఖ్యమంత్రులపై కేసులుపెట్టి భయపెట్టాలనుకోవడం మోడీ లాంటి ప్రధానమంత్రికి మాయనిమచ్చ.
    చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా అదుపుచేయడానికి ప్రయత్నిమ్చడం మోడీ తెలివితక్కువ తనమే తప్ప,చంద్రబాబుకి పోయేదేమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.