ఢిల్లీలో గవర్నర్‌కు చేదు అనుభవం

గవర్నర్‌ అనగానే కేంద్రానికి చెందిన నిఘా వ్యక్తి అనుకుంటాం.. అందులో ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ విషయంలోనైతే మరింత ఎక్కువగా అనుమానంగా చూస్తాం.. ఇప్పటికే ఆయన వ్యవహారలపై బహిరంగంగానే చాలా పార్టీ, నాయకులు వ్యతిరేకంగా స్పందించడం చూసుంటాం. తాజాగా సీఎం చంద్రబాబు కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. అమరావతికి వెళ్లి కేంద్రానికి, రాష్ట్ర పార్టీలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నింతున్నట్లు కలర్‌ ఇచ్చిన గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిసేందుకు నిరకారించారు. అదేంటి కేంద్రానికి నమ్మిన బంటు అలా ఎందుకు చేస్తారులే అని అనుకోవద్దు… దాని వెనుక పెద్ద కథే నడిచింది. కాంగ్రెస్‌ అపాయింట్ చేసిన గవర్నర్‌లలో ఒక్క నరసింహన్‌ మినహా దేశంలో మరెవరూ లేరు… అందుకు ముందు ఐబీలో పనిచేయడం, ప్రస్తుతం ఆయన సహచరులు ప్రధాని కోటరిలో ఉండటంతో పూర్తిగా ఆయన మనసెరిగి పనిచేయడంతో తొలగించకుండా ఉంచుకున్నారు. గతేడాది మే 2న తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగుతారు అని పెట్టిన సమయంలోనూ ఒకటి రెండు నెలల్లో కొత్త గవర్నర్‌ వస్తారులే అనుకున్నారు. అయినా అందరి అంచనాలు తలకిందులు చేసి మరో ఏడాది గడిపేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీకి కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. ఈ వివరాలు తెలుసుకున్న గవర్నర్‌ వెంటనే అమరావతి వెళ్లి చంద్రబాబుతో రాయబార చర్చలు అని మీడియాకు లీక్‌ కావాలనే చేయించుకుని కేంద్రం దగ్గర మొప్పు పొందాలని చూశారు. అలా చర్చ జరుగుతున్న తరుణంలోనే ఢిల్లీ వచ్చి ఏదైన పొడగింపు దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తే కలిసేందుకు రావాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో గవర్నర్‌ నిర్వేదంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనను కొనసాగించే ఆలోచనలో బీజేపీ లేదని సమాచారం ఆయన సహచరులు అందించారు. కొంత మంది అధికారులతోనూ ముభావంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తోంది. ఇక అక్కడ ఏం చేసిది లేక అవమాన భారంతో ఎవరిని కలవకుండానే హుటాహుటీన హైదరాబాద్‌ తిరిగి వెళిపోయారు. త్వరలోనే కొత్త గవర్నర్‌ వస్తున్నట్లు సంకేతాలు కూడా బీజేపీ ఇచ్చిందట.. కర్ణాటక తరువాత మార్పు చేస్తారా ముందే స్పందిస్తారా అనేది వేచిచూడాల్సిందే మరి…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.