గవర్నర్ కు పెరుగుతున్న సెగ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాదు… ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు కేంద్రప్రభుత్వ పెద్దలకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.  రాష్ట్ర విభజన జరిగి 40 నెలలు దాటినా గవర్నర్ నరసింహన్ ఏనాడూ రాష్ట్ర బాగోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. అంతే కాదు…కనీసం నాలా బిల్లులు పాస్ చేసేందుకు కూడా గవర్నర్ ఆసక్తి కనబర్చడం లేదని మండి పడ్డారు. తనకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ కార్యకర్తలా గవర్నర్ మాట్లాడారంటున్నారు. ఫలితంగా విహెచ్ తో పాటు..చాలా మంది నేతలు గవర్నర్ తీరును తప్పు పట్టారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు అదే బాట పట్టడంతో కేంత్రప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట.

ఏపీ శాసనసభ ఆమోదించిన నాలా బిల్లు పెట్టి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకూ ఆ బిల్లు పాస్ కాలేదనేది బీజేపీ మాటగా ఉంది. చుట్టపుచూపుగా రాష్ట్రానికి వచ్చి పోవడం మినహా గవర్నర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అందుకే ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో గవర్నర్ నివాసానికి అనువైన వసతులు లేవన్న కారణంగా రాలేకపోతున్నారా అని ధ్వజమెత్తడం ఆసక్తికరంగా మారింది. 

వాస్తవంగా గవర్నర్ తీరు వివాదస్పదమవుతోంది. టీడీపీ, టీఆర్ఎస్ లను గౌరవించినట్లు మిగతా పక్షాలను చూడటంలేదని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఫిర్యాదు చేసేందుకు వెెళితే మీ ప్రభుత్వ కాలంలో తప్పులు చేయలేదా అని ప్రశ్నిచడం అహంకారంతో కూడిన మాటలనే విమర్శలు వచ్చాయి. రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్నప్పుడు అధికార, ప్రతిపక్షమనే తేడా చూపకూడదు. ఇసుకాసురుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని విపక్షాలు అడగడం గవర్నర్ దృష్టిలో తప్పు అయింది. అలా అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరండని విహెచ్ లాంటి నేతలు చెప్పే పరిస్థితికి తెచ్చుకున్నాడు గవర్నర్. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.