ఇడియ‌ట్ అంటే గూగుల్ ఏం చూపిస్తుంది?

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఒక‌సారి ‘ఇడియట్‌’ అని టైప్ చేయండి. ఎవ‌రి ఇమేజ్ లు ద‌ర్శ‌న‌మిస్తాయో వీక్షించండి. ఔరా! అంటూ మీరే ముక్కున వేలేసుకుంటారు. ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు వ‌స్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.
త‌మ అధ్య‌క్షుడు ట్రంప్ కు ఇలా సెర్చ్ ఇంజిన్ లో అవ‌మానం ఎదుర‌వుతుండ‌టంపై అమెరికా చ‌ట్ట‌స‌భ స‌భ్యులు గుర్రుగా ఉన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ, గోప్యత వంటి అంశాలపై మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ సభ్యుల జ్యుడీషియరీ కమిటీ సమావేశంలో గూగుల్ సీఈవో – ప్ర‌ముఖ భార‌తీయ అమెరిక‌న్ సుంద‌ర్ పిచాయ్‌పై తాజాగా వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశాధ్య‌క్షుడి ప‌ట్ల ఇంత‌టి అమ‌ర్యాద ఏమిటంటూ నిల‌దీశారు.
చ‌ట్ట‌స‌భ స‌భ్యుల ఆగ్రహంతో పిచాయ్ ఈ వ్య‌వ‌హారంపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇడియ‌ట్ అని టైప్ చేయ‌డానే ట్రంప్ ఫొటోలు రావ‌డానికి తాము కార‌ణం కాద‌న్నారు. ఇది ఎవరో తెరవెనుక ఉండి కావాలని చేసే పనికాదని స్పష్టం చేశారు.
కోట్లాది వెబ్‌ పేజీల్లోని సమాచారం గూగుల్‌ ఇండెక్స్‌లో కాపీ చేసి ఉంటుంద‌ని పిచాయ్‌ తెలిపారు. ఎవరైనా ఏదైనా ‘కీ వర్డ్‌’ను గూగుల్ లో వెతికినపుడు దాదాపు 200కుపైగా పోలికల ఆధారంగా సంబంధిత సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ చూపిస్తుంద‌ని వెల్ల‌డించారు. అంతేతప్ప అది ఎవరో కావాలని తెరవెనుక ఉండి చేసే పని కాద‌ని వివ‌రించారు. అయితే – పిచాయ్ వివ‌ర‌ణ‌పై చ‌ట్ట‌స‌భ స‌భ్యులు సంతృప్తి చెంద‌లేదు. గూగుల్‌లో పక్షపాత సెర్చ్‌ ఫలితాలు ఎన్నికల్లో తటస్థ ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత్‌, అమెరికా వంటి దేశాల్లో పక్షపాత సెర్చ్‌ ఫలితాలు ఎక్కువ‌మంది ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.