పవన్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గత ఎన్నికల కంటే ముందే జనసేన పార్టీని స్థాపించినా 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆ పార్టీలకు దూరమయ్యాడు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన పవన్.. ఇంకొన్ని జిల్లాలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు తమ అభిమాన నటుడు ప్రజలకు దగ్గరయ్యే క్రమంలో సినిమాలకు దూరమయ్యాడనే బాధ పవన్ ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడా..? రాడా..? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది.

పవన్.. మళ్లీ సినిమాల్లో నటిస్తాడని బడా నిర్మాతలు తేల్చి చెప్పేశారు. విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్లుగా వెలుగొందుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ముగ్గురు స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ నుంచి ఇప్పటి వరకు అదిరిపోయే సినిమాలు వచ్చాయి. తాజాగా వీళ్లు పవన్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. తమ బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఉంటుందని ఈ నిర్మాతలు చెప్పారు. ప్రస్తుతం వీళ్లు నాగ చైతన్య హీరోగా నిర్మించిన ‘సవ్యసాచి’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రమోషన్‌లో భాగంగా పవన్‌తో సినిమా గురించి వెల్లడించారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, ఒకవేళ ఇది కుదరకపోతే వారితో విడివిడిగా.. తమ బ్యానర్‌లో సినిమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ వార్త పవన్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్.. ఎప్పుడు నిజమవుతుందోనని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.