మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్

నందమూరి ఫ్యాన్స్‌కు వాళ్ల అభిమాన నటుడు శుభవార్త చెప్పాడు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేనండీ వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. తారక్ సతీమణి ప్రణతీ ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తారక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘‘నా కుటుంబం పెద్దదైంది. మగ బిడ్డ పుట్టాడు’’ అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ప్రణతీ-ఎన్టీఆర్ దంపతులకు అంతకు ముందు ‘అభయ్‌రామ్’ అనే కొడుకు ఉన్నాడు.

కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్‌కు పాప పుట్టిందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిని పీఆర్వో మహేష్ కోనేరు ఖండించడంతో అదంతా అబద్ధమని తేలింది. తాజాగా ఎన్టీఆర్ తనకు రెండో బిడ్డ పుట్టినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘బాబు పుట్టినందుకు కంగ్రాట్స్ నాన్న(ఎన్టీఆర్), ప్రణతి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయం తెలిసిన పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారట. అన్నట్లు తారక్ నిన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేశాడు.

ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ’లో నటిస్తున్నారు. తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ నిమిత్తం 18వ తారీఖు పొల్లాచ్చి వెళ్లాలి. ఇంతలో తారక్ రెండోసారి తండ్రి అయ్యాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.