చంద్రబాబును కలవరిస్తున్న గౌతంరెడ్డి

వంగవీటి రంగా పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు గౌతంరెడ్డి. బెజవాడకు చెందిన అతన్ని పార్టీ నుంచి తొలగించాలని వంగవీటిరాధ లాంటి వారు డిమాండ్ చేసారు. అంతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సరే విజయసాయిరెడ్డి తదితరులు ఆయన్ను పక్కన పెట్టాక కూడ గౌతంరెడ్డి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడి వచ్చేవాళ్లు. ఏదో వంగవీటి రాధా కోసం పక్కన పెట్టారు తప్ప మరో కారణం లేదంటున్నారు. ఇంకోవైపు గౌతంరెడ్డి తనను పక్కన పెట్టడం పై ఎలాంటి కామెంట్లు చేయలేదు. వైకాపాకు వీర విధేయుడుగానే ఉంటూ వస్తున్నారు. జగన్ సతీమణి భారతికి గౌతంరెడ్డి బంధువులు అవుతారట. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన సిద్దంగా లేడంటారు. విషయం ఏదైనా ఇప్పుడు ఆయన రూటు మార్చాడు. 
                      మొన్నీ మధ్య పవన్ కల్యాణ్ మంగళగిరిలో మొదలు పెట్టిన పార్టీ కార్యాలయ స్థలానికి వ్యతిరేకంగా గౌతం రెడ్డి మాట్లాడారు. ముస్లింలతో పాటు ఆయన మీడియా ముందుకు వచ్చి పవన్ కల్యాణ్ తీరును తప్పు పట్టారు. ఆ సంగతి మర్చి పోయారు అంతా. కానీ ఇప్పుడు సరికొత్తగా రంగంలోకి వచ్చాడు గౌతంరెడ్డి. 
చంద్రబాబును ప్రశంసిస్తున్న గౌతంరెడ్డి
సి.ఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్మభూమి కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు గౌతంరెడ్డి. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరించేలా చూడటం మాములు విషయం కాదన్నారు. అందుకే చంద్రబాబును ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. టీడీపీలో చేరేందుకే అతను ఇలా మాట్లాడుతున్నాడా లేక నిజంగానే అలా చెప్పారా అనే చర్చ సాగుతోంది. విషయం ఏదైనా విపక్ష పార్టీ నేత చంద్రబాబు తీరును మెచ్చుకున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.