ఇరుకున పడ్డ గంటా

సార్ నమస్తే. పార్టీ నుంచి ఆదేశం వచ్చింది. పవన్ కల్యాణ్ ను విమర్శించాలి. కాస్త ఘాటు తగిలించాలి. లేకపోతే కష్టమని చెప్పారు. మీరే ఇందుకు బెస్ట్. ఎందుకంటే వారితో మీకు బాగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న సంగతి మీకు తెలిసిందే కదా అని టీడీపీ సీనియర్ నేత ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి గంటాకు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు అమాత్యుడుకు. అయినా సరే పార్టీ స్టాండ్ తీసుకోవాలి. అదే పని చేశాడు. 
ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే కూడా అయ్యారు గంటా. చిరంజీవి పుణ్యమా అని మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన దుమ్ములేపారు. సినిమాలు, రాజకీయాలకు ఉన్న తేడాను పవన్ కళ్యాణ్ గమనించాలని ఉచిత సలహానిచ్చారు. పవన్ కళ్యాణ్ రెండు గంటల ప్రసంగంలో ఎక్కడా మోడీ ప్రస్తావనే తేలేదు. ఆసంగతి బయట పెట్టారు. జనసేన యూటర్న్‌ వెనుక ప్రయోజనాలను పవన్‌ వెల్లడించాలని కోరారు. సిఎం చంద్రబాబు పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన మనసులో పవన్ కు అనుకూలం. కానీ వ్యతిరేకంగా మాట్లాడాలంటే కష్టమే అంటున్నారట గంటా. నన్ను ఇరుకున పెట్టారే అని తెగ ఇదై పోతున్నాడట. ఇంకో అసలు సంగతి ఏంటంటే… పార్టీ విధానాల ప్రకారం తాను మాట్లాడాల్సి వస్తోంది. మీరు ఏం అనుకోవద్దని పవన్ అనుచరులకు గంటా చెప్పారనే ప్రచారం సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.