గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ‌మా! పోల‌వ‌ర‌మా!

బీజేపీతో టీడీపీ తెగ‌తెంపులు చేసుకున్నాక కేంద్రం నుంచి మంత‌నాలు త‌గ్గాయి. ఉక్కుదీక్ష చేసిన సీఎం ర‌మేష్‌పై క‌నీసం కాస్త‌యినా ఔదార్యం చూప‌లేక‌పోయారు కేంద్ర పెద్ద‌లు. అటువంటిది పోల‌వ‌రం విష‌యంలో బీజేపీ మెత‌క‌వైఖ‌రి అవ‌లంభిస్తోంది. విశాఖ రైల్వేజోన్ కూడా రెండు మూడు నెల‌ల్లో ఎనౌన్స్ చేసే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఎందుకీ మార్పు.. బీజేపీ ప‌ర‌వు కాపాడుకునేందుకు.. పోయిన చోట‌నే మిత్రుడిని వెతుక్కునేందుకు మార్గం వేసుకుంటుందా అంటే.. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న నిజ‌మ‌నే భావ‌న‌కు బ‌లాన్నిస్తోంది. పోల‌వ‌రం నిర్మాణం స‌గానికి పైగా పూర్త‌యింది. మిగిలిన ప‌నులు కేవ‌లం నిధులు లోపం.. కేంద్రం నుంచి అందాల్సిన కోట్లాదిరూపాయ‌ల కోసం వాయిదా వేయాల్సి వ‌స్తోంది. పైగా కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ ఇచ్చిన అనుమ‌తి మొన్న‌టితో ముగిసింది. దీంతో ఏపీ స‌ర్కారు మోదీ వైపు ఆశ‌గా చూడాల్సిన ప‌రిస్థితి. ఇటువంటి కీల‌క‌మైన స‌మ‌యంలో గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న పోల‌వ‌రంపై చంద్ర‌బాబునాయుడు దీక్ష‌ను ప్ర‌శంసించ‌టం చూస్తే.. వీళ్లేనా. నిన్న‌టి దాకా క‌ల‌సి ఉండి విడిపోయి కోట్లాడుకుంద‌నే ఆశ్చ‌ర్యం కూడా క‌లుగుతుంది. సీఎం చంద్ర‌బాబునాయుడు ప‌ట్టుద‌ల‌ను సాక్షాత్తూ గ‌డ్క‌రీ మెచ్చుకోవ‌టం.. సానుకూలంగా స్పందించ‌టం నిజంగా చంద్ర‌బాబు సాధించిన విజ‌యంగానే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న‌తో ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ దూకుడుకు కూడా కళ్లెం వేసిన‌ట్ట‌యింది. ఫ‌లితంగా ఆయ‌న కూడా రాష్ట్రంలో నిర్భ‌యంగా ప‌ర్య‌టించే వాతావ‌ర‌ణానికి టీడీపీ ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టే అని చెప్పాలి. అయితే.. గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న వెనుక కార‌ణాల‌ను అంత ఈజీగా తీసుకోవ‌టానికి లేదు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం న‌రేంద్ర‌మోదీపై పెల్లుబుకిన వ్య‌తిరేక‌త‌తో 2019లో ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా మ‌రొక‌రి పేరు ఉంచేందుకు బీజేపీ అదిష్ఠానంసూచించే పేరు నితిన్‌గడ్క‌రీ. సౌమ్యుడు రాజ‌కీయ చాణ‌క్యుడిగా ఆయ‌న‌కూ గుర్తింపు ఉంది. ఎన్‌డీఏ మిత్ర‌ప‌క్షాల్లో ఆయ‌నపై న‌మ్మ‌కం ఇప్ప‌టికీ ఉంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీడీపీతో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో వెళ‌దామ‌నే సంకేతం ఇచ్చిన‌ట్టుంది. పైగా ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్‌షా.. ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావుతో మంత‌నాలు జ‌ర‌ప‌టం దీనికి మ‌రంత బ‌లాన్నిస్తోంది. సో.. టీడీపీను బీజేపీ ఇప్ప‌టికీ నేస్తంగానే భావిస్తుంద‌నే చెప్పాలి. లేక‌పోతే.. టీడీపీతో శ‌త్రుత్వం.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై 2019 ఎన్నిక‌ల‌పై  ఎన్‌డీఏపై ప్ర‌భావం చూపుతుంద‌నే ఆందోళ‌న కావ‌చ్చ‌నేది.. రాజ‌కీయ మేధావుల విశ్లేష‌ణ‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.