గద్దర్ అందుకే భయపడుతున్నాడట…

ప్రజా కళాకారుడు గద్దర్. విప్లవ పాటలు రాయడంలో దిట్ట. జై బోలో తెలంగాణా సినిమాలో ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట గద్దరే స్వయంగా రాసుకుని పాడారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన “గదర్ పార్టీ”కు గుర్తుగా తీసుకున్నారు. తన పిల్లల పేర్లు సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల అని పెట్టుకున్నారు. తెలంగాణలో విప్లవ పాటలు రాయలన్నా, పాడాలన్న గద్దర్ తర్వాతనే. కానీ ఆయన ఇప్పుడు చాలా భయపడుతున్నాడు. తనను హతమార్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతుండటమే ఇందుకు కారణం.
తెలంగాణ పాలనలో తనకు ప్రాణ హాని ఉందని భయపడుతున్నాడు గద్దర్. అందుకే హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి సెక్యూరిటీని పెంచాలని కోరారు. చాలా సార్లు ఆయన చచ్చిబతికాడు. అంతగా ఆయన పై దాడులు జరిగాయి. 1997 ఏప్రిల్ 6 న ఆయన పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పోలీసులు ఇలా మారు వేషంలో వచ్చి కాల్చారనేది వచ్చిన ఆరోపణ. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఆ సంగతి తేల్చలేకపోయాయి. గద్దర్ శరీరంలోకి అనేక బుల్లెట్లు దిగాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ ఆ బుల్లెట్ ఉంది. 
తన పై కాల్పులు జరిపినా నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. జననాట్యమండలి ద్వారా వేల మందిని కదిలించాడు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, మరియు వరవరరావులను తమ దూతలుగా నియమించుకున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు.
తెలంగాణ సి.ఎం కేసీఆర్ తో ఆయనకు గిట్టడం లేదు. గతంలో దాడి చేసినట్లు ప్రభుత్వ పోలీసులే ఆయన్ను కాల్చి చంపుతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయం పై రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాశారు. అయినా సరే సరైన చర్యలు లేవంటున్నారు. ఒకవేళ గద్దర్ కు ఏమైనా జరిగితే అది కేసీఆర్ సర్కార్ మీదకే వచ్చే వీలుంది. కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతున్నాడు గద్దర్. అది కేసీఆర్ కు ఇష్టం లేదు. అందుకే తనకు ప్రాణ హాని ఉంటుందని బలంగా నమ్ముతున్నాడాయన. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.