ప్ర‌జా రాజ‌ధానిలో మ‌రిన్ని ఐటీ వెలుగులు

అమ‌రావ‌తి… స్వ‌యం ప్ర‌కాశం. ఏటికి ఎదురీదుతున్న చేప‌. కేంద్రం మొండిచేయి ఇవ్వ‌డంతో పాటు ఎన్నో వ్య‌తిరేక శ‌క్తులు ప‌నిచేస్తున్నా వాటిని అధిగ‌మ‌నించి రోజు రోజుకు త‌న ప్ర‌భ‌ను చాటుకుంటూ ఉంది. ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌లు, ఆస్ప‌త్రులు, ఐటీ కంపెనీలు ఇప్ప‌టికే ఎన్నో మొద‌ల‌య్యాయి. ర‌వి వేమూరి అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎన్నార్టీ సుదీర్ఘ ప్ర‌య‌త్నాలు ఫ‌లించి వాటికి తాజాగా మ‌రో ఆరు కంపెనీలు తోడు అవుతున్నాయి. బుధ‌వారం వీటిని లోకేష్ ప్రారంభించ‌నున్నారు. 1998లో చంద్ర‌బాబు ఐటీ య‌జ్ఞం ప్రారంభించిన‌పుడు ఆయ‌న ఒక్క‌డే. ఇపుడు ఆయ‌న మంత్రి లోకేష్ తోడ‌య్యాడు. దీంతో మునుప‌టి కంటే మించిన వేగంతో ఐటీ కంపెనీలు మ‌న వైపు చూస్తున్నాయి. అవ‌కాశాలు రావాలంటే… ముందు మ‌నం అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి సంసిద్ధ‌మై ఉండాలి. అలాగే ఐటీ కంపెనీలు మ‌న వైపు చూడాలంటే… మౌలిక స‌దుపాయాలు, పెట్టుబ‌డుల స‌ర‌ళీక‌ర‌ణ‌, నైపుణ్యం ఉన్న మాన‌వ వ‌న‌రులు ఉండాలి. అందుకే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా అయ్యింది మొద‌లు ఈ మూడింటిపై దృష్టిపెట్టారు. యువ‌తలో ఉద్యోగార్హ నైపుణ్యాల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంది. దాని ఫ‌లితాలు మొన్నే వచ్చాయి. ల‌క్నోలో ఓ ప్ర‌తిష్టాత్మ‌క వేదిక మీద దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న మాన‌వ వ‌న‌రుల ల‌భ్య‌త‌లో ఏపీ మొద‌టి స్థానంలో నిలిచింది. కేవ‌లం నాలుగేళ్ల‌లో ఏపీ ఈ ప్ర‌గ‌తి సాధించింది అంటే… యువ‌త‌కు ఏపీ ప్ర‌భుత్వంపై ఉన్న భ‌రోసా. భావి త‌రాల‌పై చంద్రబాబుకు ఉన్న న‌మ్మ‌కం. వీటి ఫ‌లితమే ఈ కంపెనీల రాక‌.
బుధ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి ఏపీఎన్ఆర్టీ కార్యాలయం ఇన్ఫోసైట్ భవనంలో ఐదు కంపెనీలు ( 1. GT Konnect India Pvt Ltd 2. Parikaram IT Solutions Pvt Ltd 3. M/s Teck Scape 4. Trendsoft Technologies 5. Diagno Smart Solutions) లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. అనంత‌రం 4 గంటలకు విజయవాడ, రామచంద్ర నగర్ కే బిజినెస్ స్పేసేస్ కార్యాలయంలో ఏపీ ఆన్లైన్ స్వ‌తంత్ర‌ కంపెనీ ని నారా లోకేష్ ప్రారంభించ‌నున్నారు.
ఇండియాలో ఐటీ విప్ల‌వానికి ఆద్యుడైన చంద్ర‌బాబు ఐటీ వార‌స‌త్వం లోకేష్‌కి బాగా అబ్బంది. ఆయ‌న ఐటీ మంత్రి అయ్యాక లోకేష్ కృషి సత్ఫలితాలనిస్తుంది. విభజన గాయాలు మాన్పుకుని అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం శ‌ర‌వేగంగా త‌న రూపురేఖ‌లు దిద్దుకుంటోంది. ఏపీలో ఐటీ ఏంటి అనే స్థాయి నుంచి నాలుగేళ్ల‌లో ఏపీ అయితే బెట‌రేమో అని ఐటీ కంపెనీలు ఆలోచించే స్థాయికి వ‌చ్చాయి పరిస్థితులు. రెండేళ్ల క్రితం ఐటీ శాఖా మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత కంపెనీల రాక ఊపందుకుంది.

ఏపీలో ఐటీ కంపెనీల రాక‌కు కార‌ణాలేంటి?
ఏపీ ప్ర‌భుత్వం రూపొందించిన ఐటీ పాలసీలు, కంపెనీల ఏర్పాటుకు ఇస్తున్న ప్రోత్సాహం, ఇస్తున్న రాయితీలతో ఐటీ రంగంలో ఏపీ అనూహ్య‌మైన ప్ర‌గ‌తిని న‌మోదు చేస్తోంది. ఐటీ పాల‌సీల్లో దేశంలోనే అగ్ర‌స్థానంలో ఏపీ నిలుస్తోంది. మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన డిటిపి పాలసీ చిన్న, మధ్యతరగతి కంపెనీలకు వరంగా మారింది. 50 శాతం రెంటల్ సబ్సిడీతో అద్దె భవనాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానం వలన పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఐటీ రంగం అభివృద్ధి లో పెద్ద కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరగతి కంపెనీలు కీలక పాత్ర పోషించడంతో పాటు, అధిక సంఖ్యలో స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. దీని ప్ర‌భావం ఏ స్థాయిలో ఉందంటే.. యువ‌తలో ఐటీ వ‌ల‌స‌లు త‌గ్గాయి. ఏపీఈఐటిఏ, ఏపీఎన్నార్టీ (APEITA, APNRT)ల చొరవ మ‌రో ప్ర‌ధాన కార‌ణం.
ఈ రెండు ప్రవాసాంధ్రుల పెట్టుబ‌డుల‌ను బాగా ఆక‌ర్షిస్తున్నాయి. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో గ్రామాలను దత్తత తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడటం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. ఏపీ అభివృద్ధిని విదేశీ వేదికలపై ప్రచారం చేయ‌డంలో ర‌వి వేమూరి అధ్య‌క్ష‌త‌న ఏపీ ఎన్నార్టీ స‌క్సెస్‌ఫుల్ అడుగులు వేస్తోంది. తాజాగా ఈరోజు ప్రారంభం అవుతున్న కంపెనీలు ఈ సంస్థ కృషితో వ‌చ్చిన‌వే. వీటితో పాటు ఏపీఈఐటిఏ తెచ్చిన మరో కంపెనీ కూడా మంత్రి ప్రారంభిస్తారు. అమరావతి పరిధిలో వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటైన ఈ 6 కంపెనీల ద్వారా 600 మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఇప్పటివరకూ ఏపీఎన్ఆర్టి ద్వారా 87 చిన్న చిన్న కంపెనీలు తమ కార్యకలాపాలను ఏపీలో ఆరంభించాయి.
4610 మందికి ఉద్యోగాలు వచ్చాయి.

ఏపీఎన్ఆర్టీ కృషితో వచ్చిన కంపెనీల వివరాలు

ప్రాంతం పేరు వచ్చిన కంపెనీలు

ఎన్ఆర్టీ టెక్ పార్క్ 18
సీఆర్డీఏ రీజియన్ 13
మేథ టవర్స్ 12
ఇండ్వెల్ టవర్స్(ఆటోనగర్) 6
కె బిజినెస్ స్పేస్ 4
ఎంకె ప్రైమస్ 5
ఫైకేర్లో 2
ఎంఆర్పీ టవర్స్ 2
వుడా బిల్డింగ్ 8
టెక్ మహీంద్ర 2
క్వాంటమ్ హబ్ 4
విశాఖపట్నం 7
నెల్లూరు 1
చీరాల 1
కాకినాడ 1

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.