తెర వెనుక‌… నా సామీ!

ద‌గ్గుబాటి అభిరామ్‌.. నేచుర‌ల్ స్టార్ నాని.. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్‌.. రేపు మ‌రో స్టార్ హీరో.. ఏమైంది వీళ్ల‌కు.. ఇదంతా నిజ‌మేనా.. తెర‌వెనున సాగుతున్న చీక‌టి సంగ‌తులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది హీరోలు భ‌య‌ప‌డుతున్నారు. దీన్ని అవ‌కాశం చేసుకుని ఎంత‌మంది సొమ్ము చేసుకోవాల‌నుకుంటున్నారు. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా  చీక‌ట్లో ఎన్ని కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయి. ఎన్ని స్టార్‌హోట‌ల్స్‌లో ఈ లావాదేవీలు జ‌రుగుతున్నాయి. అంతా గ‌ప్‌చుప్‌.. ఇదీ తెలుగు సినిమా రంగ ప్ర‌స్తుత ప‌రిస్థితి.  చిత్తూరి నాగ‌య్య‌, ఎస్‌వీరంగారావు, కన్నాంబ‌, ఎన్‌టీఆర్‌, ఏఎన్ ఆర్ వంటి మ‌హామ‌హులు  నాటిన బీజం.. మ‌హావృక్ష‌మైంది. ఇప్పుడ‌ది చెద‌లు ప‌ట్టి.. నీడ‌నివ్వాల్సింది కాస్తా.. కూలిపోయే ద‌శ‌కు చేరుకుంటుంద‌నే ఆందోళ‌న కూడా లేక‌పోలేదు. తెలుగు సినిమా.. అశ్లీల‌త‌కు తావులేని ఓ ఊహాలోకం. ప్రేక్షకులు గుండెల్లో గుడిక‌ట్టి పూజించేంత‌గా చేరువైంది. పాత‌కాలంలో తెర‌మీద న‌టులు క‌నిపించ‌గానే మంగ‌ళ‌హార‌తులు ప‌ట్టారంటే అర్ధం చేసుకోవ‌చ్చు. బ్లాక్ అండ్ వైట్ నుంచి స్కోప్‌.. 35 ఎంఎం.. 70 ఎంఎం.. ఇలా డిజిట‌ల్ స్థాయికి చేరింది. కానీ నైతిక విలువ‌లు మాత్రం.. హీరోయిన్ల దుస్తులు మాదిరిగా కుచించుకుపోయాయి. ఇప్పుడు పూర్తి న‌గ్నంగా త‌యార‌య్యాయి.
ఇదీ ఇప్ప‌టి ఇండ‌స్ట్రీపై ప్ర‌తినోటా వినిపిస్తున్న మాట‌. బ్లాక్ అండ్ వైట్ స‌మ‌యంలోనూ చీక‌టి బాగోతాలున్నా ఇంత‌గా బ‌రితెగించిన సంద‌ర్భాల్లేవు. కానీ వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌.. కొత్త అందాలు.. విచ్చ‌ల‌విడిత‌నం.. విలువ‌ల ప‌త‌నం.. ఇవ‌న్నీ శ్రీరెడ్డి అనే ఓ స‌హ‌న‌టి బ‌ట్ట‌లూడ‌దీసి బ‌య‌ట‌పెడుతుంటే.. సినీ పెద్ద‌లు పెద‌వి విప్ప‌ట్లేదు. దాన్ని ఖండించ‌ట‌మో.. క్యాస్టింగ్‌కౌచ్‌ను అంతుచూస్తామ‌ని హామీనివ్వ‌ట‌మో ఏదీ లేదు. క‌త్తిమ‌హేష్ వంటి సినీ విమ‌ర్శ‌కుడు మాత్ర‌మే.. త‌న ప్ర‌చారానికి మీడియాను వాడుకుంటున్నాడే అప‌వాదు ఉంది. రేటింగ్ కోసం ఛాన‌ళ్లు.. కూడా అడ్డ‌దారి తొక్కుతున్నాయనే విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ మేనేజ‌ర్లు మాత్ర‌మే.. అవ‌కాశాల కోసం వ‌చ్చిన వారిని శారీర‌క అవ‌సరాల‌కు వాడుకున్నార‌నే అప‌వాదు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌హ‌న‌టులుగా ఏ మూల‌నో క‌నిపించి.. క‌నిపించకుండా వెండితెర‌పై వెల‌గాల‌నే ఆశ‌లతో న‌టించిన మ‌హిళా న‌టులంతా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాకాడా అప్పారావు అనే వ్య‌క్తి మెగాస్టార్ పేరు అడ్డంపెట్టుకుని సాగించిన అకృత్యాలు బ‌య‌ట‌పెడుతున్నారు. సినీ న‌టుడు రాజ‌శేఖ‌ర్‌.. అమ్మాయిల వేట‌లో త‌న భార్య జీవిత‌నే పావుగా వాడుకున్నాడ‌నే విష‌యం కూడా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. మ‌రో స్టార్‌.. మ‌సాజ్ కోసం బెంగాల్అమ్మాయిలు కావాలంటాడంటూ.. మ‌రో న‌టి కామెంట్‌. ఈ స్టార్‌.. ఆ స్టార్ అని లేకుండా.. వెండితెర‌పై ఆహాఓహో.. అనుకుని మురిసిపోయే పెద్ద‌స్టార్ ల‌కూ షాక్ ఇవ్వ‌బోతున్నామ‌నే.. హింట్ అయితే ఇచ్చారు. మ‌రి.. ఆ పంచ్‌లు ఎవ‌రిమీద పేల‌తాయో అనేది మాత్రం.. ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.