ముమ్మరమైన హోదా పోరు 

హోదా పోరు ముమ్మరమైంది. మొన్న ఏపీ అంతటా బంద్ పాటించారు. ఈ సారి జాతీయ రహదారులను దిగ్భంధనం చేయనున్నారు. ఇందుకు అన్ని పార్టీలు మద్దతు పలకనున్నాయి. బెజవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం నాయకులతోపాటు అన్ని పక్షాల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీలు ఈ భేటీకి దూరంగా ఉన్నాయి. ఒక పక్షం మరో పక్షాన్ని విమర్శించకూడదని, సమష్టి ఉద్యమాలు చేయాలని వారు నిర్ణయించారు. ఈనెల 22న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఏకమై ఉదయం 10 గంటల నుంచి జాతీయ రహదారులను దిగ్బంధనం చేయనుండటం ఉత్కంఠను పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరిస్తుందా లేదా అనేది ఉత్కంఠ పెంచుతోంది. 
పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చకు రాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కారణం ఏదైనా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక మీదట అదే జరిగేలా ఉంది. టీఆర్ఎస్‌ను అడ్డుపెట్టి రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తెచ్చి సభలో ప్రశాంతత లేదనే పేరుతో అవిశ్వాస తీర్మానం చేప్టటడం లేదని చెబుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా కలిసి రావాలని ఏపీ నేతలు కోరారు. కేంద్రానికి పరోక్షంగా సహాయపడడం సరైంది కాదని, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తాము చేస్తున్న పోరాటాన్ని గుర్తించి తమతో కలిసి రావాలని వారు కోరారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని సూచించారు. 
అవిశ్వాసం ఉండకపోవచ్చు…
మరోవైపు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడలేదు స్పీకర్ సుమిత్రా మహజన్. వైకాపా, టీడీపీలు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సభలో ప్రశాంతత లేదనే సాకుతో వాయిదా వేస్తున్నారు స్పీకర్. అందుకే ముందు అవిశ్వాస తీర్మానం సంగతి తేల్చాలంటున్నాయి వైకాపా, టీడీపీలు. 
ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు పార్లమెంటు సమావేశాల చివరి రోజున తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. వారు చేయడమే కాదు… తెలుగుదేశం ఎంపీలు అదే పని చేయాలని కోరడం ఆసక్తికరమే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.