తండ్రికి పార్లమెంట్ సీటు.. కుమారుడికి అసెంబ్లీ టికెట్

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో హోరాహోరీగా తలపడేందుకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అయితే, విభజన తర్వాత రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి అంచనాలున్న కారణంగా ఆ పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపాలని భావిస్తోంది ఆ పార్టీ. అందుకోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది టీడీపీ అధిష్టానం. ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్న టీడీపీ.. ఇప్పటికే పలువురు నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా ఢోకా లేని స్థానాల్లో మాత్రమే నిలబెట్టే అభ్యర్ధులపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిని కేటాయించారని ప్రచారం జరుగుతోంది.

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అయినా, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న దేవేందర్‌గౌడ్.. అక్కడ పట్టు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఆ స్థానంలో తిరుగుతూ బలం పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. సో, సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని మరోసారి దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే, సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. అలాగే ఆయన కుమారుల్లో ఒకరైన వీరేందర్ గౌడ్‌కు మేడ్చల్ అసెంబ్లీ స్థానం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న తూళ్ల వీరేందర్‌గౌడ్‌.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన తండ్రి దేవేందర్ గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ కారణంగానే వీరేందర్‌కు ఆ స్థానం కేటాయించారని వినికిడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.