అభిమానులు మ‌ళ్లీ మోస‌పోనున్నారా?

మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంఖ్య అధికంగానే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు త‌రువాతి కాలంలో పవన్ కళ్యాణ్ కు కూడా అభిమానులుగా మారిపోయార‌నేది విదిత‌మే! కొద్ది రోజుల క్రితం త‌న అభిమానుల‌తో పాటు అన్నయ్య అభిమానులంతా కూడా తనతో కలిసి రావాలంటూ ప‌వ‌న్ వారికి ఆహ్వానం ప‌లికారు. అయితే చిరంజీవి అభిమానులు, పవన్ అభిమానులు జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారో లేదో ఇప్ప‌ట్లో చెప్ప‌లేమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే ఈ విషయంలో మరోసారి మెగా అభిమానులు మోసపోతున్నారేమో అనే సందేహాలు క‌లుగుతున్నాయ‌ని వారు అంటున్న‌ట్టు భోగ‌ట్టా!. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలోనే చిరంజీవి అభిమానులు పూర్తి స్థాయిలో  ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.
ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయంటే  అది మెగా అభిమానుల పుణ్యమేననే టాక్ వినిపిస్తుంటుంది. ఎన్నికల్లో మెగాస్టార్ అభిమానులకు టికెట్లు కేటాయించ‌కున్నా, అభిమానులు చిరంజీవికి అండగా నిలిచార‌ని ఙ‌ప్ప‌టికీ చెప్పుకుంటారు. అయితే అప్ప‌టి ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు అభిమానులను తీవ్రంగా నిరాశ‌కు గురిచేశాయి. పార్టీ ఏర్పాటుకు ముందు అభిమానులతో సమావేశాలు నిర్వహించిన చిరంజీవి అదే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముందు  అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అప్పట్లో కొంద‌రు అభిమానులు దీనిపై ఆగ్రహం వ్య‌క్తం చేసిన దాఖ‌లాలున్నాయి. తాము చిరంజీవిని న‌మ్మి మోస‌పోయామ‌ని వాపోయిన‌వారూ ఉన్నార‌ని తెలుస్తోంది.. అయితే ఈ ఉదంతం జరిగి కొన్నేళ్లు గడిచిపోవడంతో ఈ గ‌తాన్ని చాలామంది ఫ్యాన్స్ మర్చిపోయిన‌ట్లున్నారు. కానీ రాజకీయ విశ్లేష‌కులు మరోసారి మెగా ఫ్యామిలీ అభిమానులు మోసపోబోతున్నారేమో అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్టీ పెట్టి అభిమానులను చిరంజీవి మోసం చేశారని, ఇప్పుడు పవన్  కూడా అదే విధంగా చేస్తారేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది . పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో లేదోకానీ, ఆయ‌న‌ను న‌మ్ముకుని, సొంత ప‌నులు వ‌దులుకొని ఆయ‌న చుట్టూ తిరుగుతున్న‌వారు త‌మ భ‌విష్య‌త్ కూడా  ఆలోచించుకోవాల‌ని  రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.