గజల్ శ్రీనివాస్ కు బిగుస్తున్న ఉచ్చు

లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. గజల్‌ శ్రీనివాస్‌ తనను లైంగికంగా వేధించినట్లు కుమారి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. సీడీల ఆధారాలను వారికి ఇచ్చిందా యువతి. ఫలితంగా అతను తప్పించుకునే అవకాశం లేదంటున్నారు. ఫలితంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ లయ రేడియో జాకీగా పనిచేస్తోంది. వెంకటరమణ కాలనీలో ఉంటున్న మహిళను ఆరునెలలుగా శ్రీనివాస్‌ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అవి ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. 
             తన వద్ద పని చేస్తున్న యువతితో మసాజ్ చేయించుకోవడమే కాదు.. లైంగికంగా వేధించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని శ్రీనివాస్‌ బుకాయిస్తున్నాడు. ఆ అమ్మాయి కూతురుతో సమానమని చెబుతున్నాడు. తనపై ఎందుకు తప్పుడు ఫిర్యాదు చేసిందో తెలియదన్నారు. తనకు ప్రమాదం జరిగి భుజానికి దెబ్బ తగిలితే ఆమె మందు రాసిందని చెప్పారు. వద్దని చెప్పినా వినలేదన్నారు. తాను ఆమెతో మసాజ్‌ చేయించుకుంది నిజం కాదన్నారు. 
            మరోవైపు గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన అన్ని ఆధారాలను తీసుకుంటున్నారు పోలీసులు. గజల్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఆ యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామన్నారు. గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఉండటంతో తిరుగులేని ఆధారాలుగా మిగలనున్నాయి. 
               ప్రముఖ టీవీ న్యూస్ చానల్ లో పని చేసిన యాంకర్ తోను గజల్ శ్రీనివాస్ కు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోన్ ద్వారా గంటల తరబడి మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.