వైసీపీలో చేరి అందరికీ షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో వైవిధ్యమైన రాజకీయం దర్శనమిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా, ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలు మాత్రం తమ భవిష్యత్ గురించి జాగ్రత్తలు పడుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో నేతలకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ముఖ్య నేతలు పార్టీల్లోకి రావాలన్నా.. అదే పార్టీలో కొనసాగాలన్నా అధిష్ఠానాల ముందు డిమాండ్లను ఉంచుతున్నారు. వాటికి ఆయా పార్టీలు ఒప్పుకుంటే ఓకే.. లేకపోతే మాత్రం తమ దారి వాళ్లు చూసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ దక్కదని భావించిన చాలా మంది నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఏపీ రాజకీయాల్లోకి జనసేన పార్టీ ఎంటరైన తర్వాత వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, టీడీపీకి చెందిన చాలా మంది నేతలు ఇప్పటికే ఆ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు వారి బాటలోనే పయణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలాఉండగా, గత ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారవుతుంది. గతంలో జరిగిన చేరికలతో ఆ పార్టీ హౌస్‌ఫుల్ అయింది. ఇప్పుడు చాలా మందికి టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.

ఈ కారణంగానే పలువురు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత కొందరు నేతలు టీడీపీకి రాజీనామా చేసేశారు. తాజాగా, సైకిల్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పేశారు. ఆయనే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి. 2014 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయిన ఆయన.. గత ఏడాది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అనంతపురంలో బలమైన అనుచరగణం ఉన్న ఆయనన.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు. అప్పుడు జేసీ కుటుంబం తప్ప మిగిలిన వారందరూ ఆయన చేరికను వ్యతిరేకించారు. అయినా, ఇన్ని రోజులు అదే పార్టీలో కొనసాగారు. ఆదివారం ఆయన టీడీపీకి రాజీనామా చేయడంతో, జనసేనలోకి వెళ్తారని అంతా భావించారు. దీనికి కారణం టీడీపీలో చేరిన సమయంలో ఆయన జగన్‌ను బాగా విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేవనే టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా గుర్నాథ్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.