జగన్ వల్ల మాజీ జేడీ బీజేపీకి దూరమయ్యారా..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసులతో వెలుగులోకొచ్చి, అనతి కాలంలోనే నిజాయితీ గల ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణను భారతీయ జనతా పార్టీనే రాజీనామా చేయించిందా..? ఇప్పుడు ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఏపీకి ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు, సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులతో లక్ష్మీనారాయణ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రేగిపోయింది. దీని తర్వాత ఆయన మహారాష్ట్రకు బదిలీ అయి వెళ్లిపోయారు. అయితే, అయితే, ఊహించని విధంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు, విభజన హామీల అమలు విషయంలో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందనే టీడీపీ ఆరోపణలతో రాష్ట్రంలో ఆ పార్టీపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ కారణంతోనే లక్ష్మీనారాయణను రాజీనామా చేయించి, తమ పార్టీలో చేర్చుకోవాలని తద్వారా తమ పార్టీలో నిజాయితీ ఆఫీసర్ చేరాడని చెప్పుకోవచ్చనే ఉద్దేశంతోనే బీజేపీ ప్లాన్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దీనిపై ఆయన నోరు మెదపకపోవడంతో ఇది నిజమేనని అనుకున్నారంతా. అయితే, కొద్దిరోజులుగా ఈయనకు సంబంధించిన ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. లక్ష్మీనారాయణను బీజేపీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు ఆయనతో తన పదవికి రాజీనామా చేయించారట. అయితే, పార్టీలో చేరే వరకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని, దానికి గానూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జనసేనను కూడా కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పాల్గొందామని కూడా చెప్పారని తెలిసింది. వీటికి అంగీకరించిన మాజీ జేడీ కూడా అందుకు తగ్గట్టుగానే పని చేయడం ప్రారంభించారని సమాచారం. అయితే, కొద్దిరోజుల తర్వాత జరిగిన సమావేశంలో బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఆయన ‘మీ మిషన్‌లో భాగస్వామిగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలవకూడదు’ అని ఆ పార్టీ పెద్దల ముందు ఓ ప్రతిపాదన ఉంచారని తెలిసింది. అంతేకాదు, అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుతున్న జగన్‌తో తాను కలిసి పని చేయలేనని బీజేపీ నేతలకు తేల్చి చెప్పారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ కూడా జగన్‌తోనే కలిసి పయనించడానికే ప్రాధన్యమిచ్చిందని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.