యాదాద్రిలో ఎన్నిక‌ల కోలాహాలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార, విపక్ష నేతల హడావుడి చూస్తుంటే రేపోమాపో ఎన్నికలన్నట్టుగా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరేయడానికి తమదైన ఎజెండాతో ముందుకు సాగుతున్నారు వివిధ పార్టీల నేతలు! ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్యన ఉండేలా.. ప్రజల దృష్టి తమవైపు ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఎన్నికలకు ఏడాది టైమున్నా బరిలో తామున్నామనే సంకేతాలను ఇచ్చుకుంటున్నారు నేతలు. తమకున్న వనరులతో పార్టీని బలోపేతం చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే అంతర్గతంగా ప్రచారం ప్రారంభించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ స్థానికంగా ఇమేజ్‌ పెంచుకుంటున్నారు.
అభివృద్ధి మంత్రంతో అధికారపార్టీ నేతలు నిత్యం ప్రజల్లోఉండేలా ప్లాన్‌ చేసుకుంటూనే… రాజకీయాలకు తెర తీశారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారం మోత మోగిస్తున్నాయి. ప్రజాసమస్యలపై గళం విప్పుతూ .. గడపగడపకు కాంగ్రెస్‌ పేరుతో హస్తంపార్టీ నేతలు హంగామా చేస్తున్నారు. ప్రజాసమస్యలపై పాదయాత్రలు.. నిరసనలతో జనం దృష్టితో పడేందుకు ప్రయత్నిస్తోంది కమలం పార్టీ! ఇదంతా చూసి అధికారపార్టీ నేతలు కూడా అలెర్టయ్యారు. అభివృద్ధి పనులను సమీక్షిస్తూ.. ప్రజలలో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కొందరు నేతలు మాత్రం జరుగుతోన్న పరిణామాలను సీరియస్‌గా గమనిస్తూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఎన్నికల నాటికి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నది వీరి ఆలోచన! మొత్తం మీద జిల్లాలో మాత్రం సందడి మొదలయ్యింది.. మరి ఓటరు మహాశయుడు ఏ దిక్కునుంటాడో చూడాలి.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.