‘ఈ నగరానికి ఏ మైంది?’ మూవీ రివ్యూ

సినిమా పేరు : ఈ నగరానికి ఏ మైంది?

న‌టీన‌టులు : విష్వ‌క్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, అనీషా ఆంబ్రోస్‌, వెంక‌టేశ్ కాకుమాను, సిమ్ర‌న్ చౌద‌రి, గీతా భాస్క‌ర్ దాస్యం త‌దిత‌రులు

మ్యూజిక్‌ : వివేక్‌ సాగర్‌

నిర్మాత : డి.సురేష్‌బాబు

ద‌ర్శక‌త్వం : త‌రుణ్ భాస్కర్ దాస్యం

సురేశ్‌బాబు ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడంటే త‌ప్పకుండా ఆ సినిమాలో యువ‌త‌ను ఆక‌ట్టుకునే అంశం ఏదో ఉంద‌నే అర్థం. అందులోనూ ఈ సారి ఆయ‌న అసోసియేట్ అయింది తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు త‌రుణ్ భాస్కర్ దాస్యంతో. చిన్న చిత్రంగా విడుదలైన ‘పెళ్ళి చూపులు’ పెద్ద విజయాన్ని అందుకుంది. మారేడ్‌ప‌ల్లి కుర్రాడిగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ కెరీర్‌ని మొద‌లుపెట్టిన త‌రుణ్ భాస్కర్ దాస్యం తొలి సినిమా  తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ట్రెండ్‌కి భిన్నంగా రెండో చిత్రాన్ని కూడా కొత్త న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించారు దర్శకుడు.. మ‌రి అత‌ని న‌మ్మకాన్ని రెండో సినిమా కూడా నిల‌బెట్టిందా… ఈ ప్రయోగం ఎలా ఉంది? ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? క‌మ్ లెట్స్ గో త్రూ ద రివ్యూ.

క‌థ‌ :

వివేక్ (విష్వక్సేన్  నాయుడు), కార్తీక్ (సుశాంత్‌రెడ్డి), కౌశిక్ (అభినవ్‌గో మతం), ఉపేంద్ర (వెంకటేశ్‌ కాకుమాను).. స్నేహితులు. వివేక్ డైర‌క్టర్‌గా, కార్తీక్ కెమెరామేన్‌గా, ఉపేంద్ర ఎడిట‌ర్‌గా, కౌశిక్ హీరోగా ఓ షార్ట్ ఫిల్మ్ చేయాల‌నుకుంటారు. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే వివేక్ ప్రేమ‌లో ప‌డతాడు. అత‌నికున్న భ‌యాన్ని చూసి అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ బ్రేక‌ప్ చెబుతుంది. దాంతో తాగుడుకు బానిసై క‌ర్త‌వ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు వివేక్‌. వీరంద‌రికీ దూరంగా వెళ్లి కార్తిక్ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో ఉంటాడు. కౌశిక్ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, ఉప్పు ఎడిట‌ర్‌గా ఉద్యోగాలు చేస్తుంటారు. కార్తీక్ పెళ్లి కుదరడంతో స్నేహితుల‌కు పార్టీ ఇస్తాడు. హైద‌రాబాద్‌లో మొద‌లైన వాళ్ల పార్టీ గోల గోవాకు చేరుకుంటుంది. అత్యంత గ‌త్యంత‌రం లేక ఓ షార్ట్ ఫిల్మ్ చేయాల్సి వ‌స్తుంది. ఎందుకు?  ఏంటి? ఆ షార్ట్ ఫిల్మ్ క్లిక్ అయిందా?  వారి జీవితాల‌ను గోవా ట్రిప్ ఎలా మార్చేసింది?  అస‌లు ఇంత‌కీ గోవాలో జ‌రిగింది ఏంటి?  వారి మధ్య సాగే అల్లర్లుచిరు కోపాలు, ఎలా సాగాయి అనేదే కథ.

విశ్లేష‌ణ‌ :

స్కూల్ డేస్‌, కాలేజ్ డేస్‌లో ఎవ‌రికైనా ఓ గ్యాంగ్ ఉంటుంది. అల్లర్లు, స‌ర‌దాల‌న్నీ ఆ గ్యాంగ్ తోనే.. పూట‌కి నాలుగు మెతుకులు తింటూ, న‌చ్చిన ప‌ని చేసుకుంటూ, మ‌న‌వారు న‌లుగురితో ఉంటే ఆ ఆనంద‌మే వేరు క‌దా. ఆ ఆనందాన్నే తెర‌మీద చూపించాల‌నుకున్నారు త‌రుణ్ భాస్కర్. వివేక్‌ యాటిట్యూడ్‌, కార్తీక్‌ సిన్సియారిటీ, కౌశిక నవ్వులు, ఉపేంద్ర అమాయకత్వం ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్‌ ఇచ్చి, వాటితోనే వినోదం పండించే ప్రయత్నం చేశాడు. సినిమాలో 60 సన్నివేశాలు ఉంటే, ఏ సన్నివేశంలోనూ సినిమాటిక్‌ ఉండదు. నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నట్లు కలిసి ప్రయాణం చేస్తున్నట్లు, కొట్టుకుంటున్నట్లు ఉంటుంది.రియ‌ల్ లైఫ్‌లో త‌ను చూసిన సంఘ‌ట‌న‌ల‌కు కాసిన్ని ఊహ‌ల‌ను జోడించి తెర‌మీద ప్రెజెంట్ చేశాడు. జీవితంలో స్థిర‌ప‌డాల‌నుకునే యువ‌కుల మ‌న‌స్తత్వం ఎలా ఉంటుంది?  న‌లుగురు కుర్ర‌కారు కూర్చుని మాట్లాడుకుంటే చాటుగా మ‌నం విన్న‌ప్పుడు ఎలాంటి డైలాగులు వినిపిస్తాయో అలాంటి డైలాగులు… మేన‌మామ తండ్రిలాంటి వాడే అయినా, మేన‌ల్లుడికి ఒక ర‌కంగా స్నేహితుడిలాంటి వాడు అని చూపించే షాట్లు… జీవితం ఎక్క‌డా ఆగిపోదని, కావాల్సిన నాలుగు మెతుకులు, మ‌న అనుకున్న న‌లుగురు స్నేహితులు, న‌చ్చిన ఉద్యోగం, ఎదురుప‌డితే న‌వ్వుతూ ప‌ల‌క‌రించే న‌లుగురు ఆప్తులు అని చెప్ప‌క‌నే చెప్పిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. స‌న్నివేశాల్లో కామెడీ పంచ‌డం కోసం తాగుడు స‌న్నివేశాల‌ను రాసుకుని, దానికి జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌డానికి `ఈ న‌గ‌రానికి ఏమైంది` అని టైటిల్ పెట్టాడు త‌రుణ్ భాస్క‌ర్‌. మొద‌టి సినిమా నుంచి కూడా అత‌నికి స‌హ‌జ ధోర‌ణే. త‌న ఫ్రెండ్స్ తో ఉంటే ఎలా ఉంటాడో, త‌న సినిమాను కూడా అంతే స‌ర‌దాగా తీయాల‌నుకుంటాడు. ఈ సారి అదే ప్రయ‌త్నం చేశాడు. వ‌య‌సు మీద ప‌డుతున్న సురేశ్ బాబు ఇంత మంచి యూత్‌ఫుల్ స్టోరీని అంగీక‌రించారంటే ఆయ‌న మాన‌సికంగా ఇంకా ఎంత యూత్ ఫుల్‌గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. వివేక్‌సాగ‌ర్ మ్యూజిక్‌, నికిత్ కెమెరా కూడా సినిమాకు ఎసెట్ అయ్యాయి. న‌టీన‌టులంద‌రూ ఎక్కడా కొత్తవార‌నే ఫీలింగ్‌ని కనిపించ‌నివ్వలేదు. సినిమా చూస్తున్నంత సేపు వారు న‌టిస్తున్నార‌నే విష‌యాన్నే మ‌నం మ‌ర్చిపోతాం. అంత‌గా పాత్రల్లో లీన‌మై చేశారు వారు. ఇవాళ్రపు బీ,సీ అనే తేడా ఉండ‌టం లేదు. అన్నీచోట్లా ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఉంటాయి. స‌ర‌దాగా తాగేవారూ ఉంటారు. క‌ల‌ల కోసం ప్రయ‌త్నాలు సాగించే వారు ఉంటారు. అలాంటి వారంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. వ‌రుస ఫైట్లు, ఐట‌మ్ సాంగ్స్, క‌న్నీరు పెట్టుకునే సీన్స్ కోసం ఆశించి థియేట‌ర్లకు వ‌చ్చే వారికి మాత్రం ఈ సినిమా న‌చ్చదు

ప్లస్ పాయింట్లు :

 + స‌హ‌జంగా చిత్రీక‌రించిన విధానం

+ యూత్‌కు నచ్చే సన్నివేశాలు

+ కామెడీ

+ టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్

మైన‌స్ పాయింట్లు :

– క‌థ, కథనం పాత‌దే

– స‌హజ‌త్వానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపించ‌డం

చివరగా :  స‌ర‌దాగా ఒకసారి చూడొచ్చు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.