నెలల కష్టం వృధా! రజత్ కుమార్ ఆగ్రహం!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి ఎలక్షన్ కమీషన్ నిర్వహించిన విధులు వెలకట్టలేనివి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని పకడ్బందీ చర్యలు చెప్పటింది ఈసీ. ముఖ్యంగా ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని.. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి విషయంలో జరిగిన ఉదంతం.. దాదాపు నాలుగు నెలల పాటు ఆయన పడిన కష్టానికి గుర్తింపు లేకుండా చేసిందని టాక్ నడుస్తోంది. ఇది తెలిసిన రజత్ కుమార్.. తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఇంత కష్ట పడ్డా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని మనస్థాపం చెందుతున్నారట.
కొడంగల్ లో కేసీఆర్‌ బహిరంగ సభను వ్యతిరేకించిన రేవంత్.. బంద్‌కు పిలుపునివ్వగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే తాను ఆదేశిస్తే, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని ఆయన అంటున్నారట. చివరకు ఈ ఉదంతంలో తనపై అపవాదులు రావటం తీవ్రంగా బాధిస్తుందని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. రేవంత్ రెడ్డి అరెస్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టడం, దానిపై హైకోర్టు రియాక్ట్ అవుతూ మందలించడం ఆయనను చాలా బాధ పెట్టిందట. అంతేకాదు ఈ విషయమై ఆయన ఆగ్రహంతో కూడా రగిలి పోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఎన్నికలకు మరి కొన్ని గంటల సమయమే ఉన్న ఈ తరుణంలో ఆయన.. మీడియా ముందుకు రావడానికి సైతం ఇష్టపడకపోవడం ఆయనలో ఉన్న అసంతృప్తిని బయటపెడుతోంది. ఈ జాగ్రత్తలన్నీ ఎన్నికలు సజావుగా జరగాలనే కదా! నేను కృషి చేసింది.. అలాంటిది నాపైనే ఇలా విరుచుకుపడటం సబబేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తనకు ఏ మాత్రం మింగుడుపడటం లేదని పేర్కొంటూ చాలా కోపంతో ఉన్నారట రజత్!. ఇన్ని రోజులూ రేవంత్ రెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్ అనుకుంటే.. ఇప్పుడు రజత్ కుమార్ ఆవేదన చర్చనీయాంశం కావటం విశేషం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.