తండ్రికి పాఠాలు చెబుతున్న కొడుకు

డి. శ్రీనివాస్. టీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన బాగా చక్రం తిప్పేవారు. ఇప్పుడు అంత పరిస్థితి లేకపోయినా పర్వాలేదు. కాకపోతే ఆయన కొడుకు అరవింద్ రూపేణా ఇబ్బంది ఎదురవుతోంది. తండ్రి టీఆర్ఎస్ లో ఉంటే కొడుకు బీజేపీలో ఉన్నారు. రాజకీయంగా ఇద్దరికీ అసలు పడటం లేదు. ఫలితంగా తండ్రి పైనే ధర్మ యుద్దం ప్రకటించారు. ఇప్పుడా సంగతి ఆసక్తికరంగా మారింది. 
గులాబీ పార్టీలో ఉంటే సీటు వస్తుందో రాదో తెలియదు. అందుకే ముందుగానే మరో పార్టీలోకి జంప్ చేశారు. తండ్రికి తలనొప్పి తగ్గించాడు. కానీ అసలు తలనొప్పి ఇప్పుడే మొదలైంది. బీజేపీలో చేరిన డిఎస్ కుమారుడు అర‌వింద్ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌పై నిప్పులు చెరుగుతు న్నారు. తెలంగాణ ఆత్మగౌర‌వ నినాదంతో అధికారంలోకి వ‌చ్చిన పార్టీ.. తెలంగాణ వారి కోసం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. గ‌తంలో తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు.. చేసిన త‌ప్పుల‌నే మీరు కూడా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
అర‌వింద్ త‌నతండ్రిని సైతం విడిచి పెట్టలేదు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని తండ్రిని నేరుగా కోరాడు అరవింద్‌. ‘నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత ఆ సంగతి పట్టించుకోవటం లేదు. ఆమెను ఎన్నుకున్న ప్రజ‌ల‌ను మోసం చేస్తున్నారు. సొంత వ్యాపారాలతోనే ఆమెకు కాలం గడుస్తుందని ఆరోపించారు. మీరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాబట్టి.. సాధ్యమైనంత త్వర‌గా చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యాలని తండ్రి డిఎస్ కు చెప్పారు. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ఎందుకు ఆ ఫ్యాక్టరీ తెరిపించడం లేదని తండ్రిని నిలదీశారు. 
చెరకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని చెబుతున్నారు. అది నిజం కాదు. పసుపు బోర్డు విషయంలో కవిత చాలా వరకు పోరాడినా కేంద్రం నుంచి సానుకూలత రాలేదు. ఫలితంగా కవిత పెద్దగా ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అరవింద్ తండ్రికే పాఠాలు చెప్పడం హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.