కేసీఆర్ తీరుతో అనుమానాలు…

కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. కాకపోతే ఆ చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ విషయంలో బయటకు పొక్కింది. స్వామి గౌడ్ పై దాడి జరిగిందని.. చేసిన 17 నిమిషాల తర్వాత గుర్తుకు వచ్చిందట. గవర్నర్ నరసింహన్ ను బయటకు సాగనంపే సమయంలో స్వామి గౌడ్ బాగానే ఉన్నారు. కానీ హఠాత్తుగా ఆయన్ను చక్రాల కుర్చీలో కూర్చోపెట్టారు. ప్రైవేటు ఆసుపత్రికి కాకుండా సరోజిని ఆసుపత్రికి తరలించారు. అక్కడైతే వైద్యులు తాము చెప్పినట్లు వింటారనే ఆ పని చేశారంటున్నారు. కాకపోతే ఒకసారి కుడి కంటికి బ్యాండేజి ఉంటే.. మరోసారి ఎడమ కంటికి బ్యాండేజ్ వచ్చింది. ఫలితంగా అసలు ఆయన కంటికి గాయం ఎటువైపు అయిందో ఎవరికీ అర్థం కావడంలేదు. అందుకే కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. బయట అదే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ వారు సభలో ఉంటే ఇబ్బంది. అందుకే వ్యూహాత్మకంగా వారిపై వేటు వేసారు. ఉప ఎన్నికలకు సిద్దమయ్యారు. అసలు సంఘటనపై విచారణ జరిపి.. చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అదేం చేయకుండా ఏకంగా సభ్యులపై అనర్హత వేటు వేయడం స్పీకర్ తీరును తప్పు పట్టేలా చేస్తోంది. 
కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదా…
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులను బహిష్కరించే అధికారం స్పీకర్‌కు లేదనే వాదన చేస్తున్నారాయన. స్పీకర్ రూల్స్‌‌కు వ్యతిరేకంగా నిర్ణయం జరిగింది. గవర్నర్ చేయాల్సిన పనిని స్పీకర్ చేశారు. ఇది చట్టంలో నిలబడదని వాదిస్తోంది కాంగ్రెస్. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని.. అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారని ఆయన ఇంటి సభ్యులే చెప్పారనేది కాంగ్రెస్ చేసిన ఆరోపణ. కేసీఆర్ కు ఏదైనా అయితే కొడుకో, అల్లుడో ఎవరో ఒక్కరూ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రచారం చేసింది ఎవరో విచారణకు అదేశించాలని రేవంత్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. కోమటిరెడ్డి తాగివచ్చారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణ. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మామ ఎస్టీల పేరు మీద ఉద్యోగం సంపాదించి రిటైర్ అయి నెలకు రూ. 52 వేల జీతం తీసుకుంటున్నారనేది రేవంత్ ఆరోపించడం కలకలం రేపుతోంది. హరీష్ రావు ఇంకా అక్కడుంటే నడ్డి విరగకొడతారని బయటకు రావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం మరింత ఆసక్తిని పెంచుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.