పార్టీ ఫిరాయింపుల పై ఆలస్యం చేయవద్దన్న వెంకయ్య

     ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొన్ని విషయాల్లో చాలా కచ్చితంగా చెబుతాడు. ఎవరు ఏమన్నా అనుకోని..చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పేస్తాడు. ఇంకొన్ని సార్లు చెప్పాల్సినవి పక్కన పెట్టేస్తారు.. ఎపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు అనేక మాటలు మాట్లాడారు. హోదా ఐదేళ్లు కావాలని ఒకసారి..అవసరం లేదని మరోసారి. హోదా కంటే ప్యాకేజి మంచిదని ఇలా నానా రకాలుగా మాట్లాడారు. ఫలితంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వారు వెంకయ్యనాయుడు తీరు పై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. 
           వెంకయ్యనాయుడు ఉండటం వల్లనే ఏపీకి రావాల్సిన నిధులు, పనులు అవుతున్నాయనేది నిజం. ఆయన లేని లోటు ఏపీ ప్రభుత్వానికి కచ్చితంగా తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా ఉంటూనే ఏపీని ఆదుకునేందుకు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తన వంతుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకయ్యనాయుడు. అలాంటి రాజకీయ నేత అరుదుగానే ఉంటారు. ఇప్పుడు ఆయన చూపు పార్టీ ఫిరాయింపుల పై పడింది. తన వద్ద పెండింగ్ లో ఉన్న రెండు ఫిర్యాదులను ఆయన పరిష్కరించాడు. అంతే కాదు..మూడు నెలలకు మించి స్పీకర్లు తమ వద్ద పార్టీ ఫిరాయింపుల పైల్ ను పెట్టుకోవద్దని సూచించారు. ఫలితంగా స్పీకర్లు వింటారా లేదా అనేది వారి విచక్షణకే వదలేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి. ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయకుండా సిగ్గు ఎగ్గూ లేకుండా ఆయన మంత్రిగా కొనసాగుతున్నారనే విమర్శలున్నాయి. ఆయనే కాదు..భూమా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమరనాధ్ రెడ్డి, సుజయ రంగారావులాంటి వారిది ఇదే తీరు. పార్టీ ఫిరాయించిన వారు తమకు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేస్తే పద్దతిగానే ఉండేది. 
         కానీ ఆ పని చేయక పోవడం వల్ల స్పీకర్ ల పనితీరు అనుమానాలకు తావిస్తోంది. అధికారి పార్టీ ఒత్తిడులకు తలొగ్గి..రబ్బర్ స్టాంపులా స్పీకర్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే దీని పై వెంకయ్యనాయుడు కాస్తంత ఘాటునే చెప్పారు. మూడు నెలల్లోపు ఫిరాయింపుల ఫైల్స్ ను పరిష్కరించాలని సూచించారు. తాను చేసి. మిగతా వారిని చేయాలని చెప్పారు వెంకయ్య.    
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.