మోడీకి మంచి స్ట్రాంగ్ పంచ్ ప‌డింది

ఈ దేశం అనేక‌మంది ప్ర‌ధానుల‌ను చూసింది. ఒక్కొక్క‌రు ఒక్కో ముద్ర వేసిపోయారు. అయితే, కొంద‌రు దేశంలో ప్ర‌భావ‌వంత‌మైన మార్పుకు కార‌ణ‌మ‌య్యారు. కొంద‌రు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. కానీ ఒకే ఒక్క ప్ర‌ధాని దేశాన్ని తిరోగ‌మ‌నం ప‌ట్టించారు. చివ‌ర‌కు సంకీర్ణ ప్ర‌భుత్వాల్లో కూడా క‌ల‌గ‌ని విప‌త్తు… సంపూర్ణ మెజారిటీ ద్వారా ఎన్నిక‌యిన ప్ర‌ధాని వ‌ల్ల క‌ల‌గ‌డం దేశానికి పెద్ద గుణ‌పాఠం.

ఈరోజు పెద్ద నోట్ల ర‌ద్దుకు రెండో ఏడాది. కానీ అది మిగిల్చిన చీకటి ఇంకా ల‌క్ష‌ల కుటుంబాల్లో అలాగే మిగిలి ఉంది. ఈరోజుకీ నోట్ల ర‌ద్దు సాధించిన విష‌యం ఏంటో… ప్ర‌భుత్వానికి క్లారిటీ లేదు. జ‌నం నుంచి, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆర్థిక మంత్రి, ప్ర‌భుత్వం క‌లిసి క‌వ‌ర్ చేసుకోవాల్సిన దుస్థితి. 50 రోజులు ఇవ్వండి నిర్ణ‌యం త‌ప్ప‌యితే ఉరితీయండి అని చెప్పిన మోడీకి జ‌నం ఈరోజు మ‌ళ్లీ దానిని గుర్తుచేశారు. 50 రోజులు ప‌దికి పైగా ఇచ్చాం. ఏం చేశారు మోడీ అని ప్ర‌శ్నించారు. కానీ… త‌న‌కు న‌చ్చిన వాటిపై మాత్ర‌మే స్పందించే మోడీ… య‌థావిధిగా ఎస్కేప్ అయ్యారు. ఆయ‌న మంత్రిగారు విధిలేని ప‌రిస్థితుల్లో నోట్ల ర‌ద్దు ఉప‌యోగాల గురించి గొప్ప‌లు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా చాలామంది మోడీపై ఈరోజు విమ‌ర్శ‌లు చేశారు. త‌మిళ‌నాడులోని డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన విమ‌ర్శ‌లు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. మోడీ క‌నుక వాటిని వింటే… సిగ్గుప‌డ‌క త‌ప్ప‌దు. ఆయ‌న ఏమ‌న్నారో చ‌ద‌వండి.

*నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమయింది. ప్రజలు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. దేశానికి ఒక వ్యక్తి తీసుకొచ్చిన విపత్తే నోట్ల రద్దు. ప్రజల సొమ్మును ఇల్లీగల్ గా ప్రకటించడంతో… దేశ ప్ర‌జానీకం రోడ్ల మీదకు వచ్చింది. బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూలు క‌ట్టారు. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోయారు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. చిన్న పరిశ్రమలు ఎన్నో మూత పడ్డాయి. ల‌క్ష‌ల కుటుంబాల్లో చీక‌ట్లు అలుముకున్నాయి. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది*
– ఇది స్టాలిన్ ట్వీట్‌. ఇప్ప‌టికైనా మోడీ త‌న తప్పుల‌ను గుర్తిస్తే క‌నీసం ఆయ‌న‌లో మాన‌వ‌త్వం ఇంకా మిగిలి ఉన్న‌ట్టు అని ఆశించ‌డం త‌ప్ప జ‌నాలు చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. కాక‌పోతే మ‌రికొన్ని నెల‌ల్లో రానున్న ఎన్నిక‌ల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.