డీఎంకే.. మ‌రో అన్నాడీఎంకే అవుతుందా!

ద్ర‌విడ యోధుడు.. ద‌క్షిణామ్మూర్తి.. అలియాస్ క‌రుణానిధి శ‌కం ముగిసింది. డీఎంకే వార‌సుడిగా.. త‌న‌యుడు స్టాలిన్ ప‌గ్గాలు చేప‌ట్ట‌డ‌మే మిగిలింది. మూడేళ్ల క్రిత‌మే త‌న రాజ‌కీయ వార‌సుడిగా స్టాలిన్ పేరు చెప్పారు క‌రుణ‌. ముగ్గురు భార్య‌లు. ఇంత‌మంది వార‌సులు.. అయినా ఎవ‌రూ అధినేత‌పై నోరెత్తే ధైర్యం చేయ‌లేదు. వ‌ర్గాలు క‌ట్టేంత సాహ‌సం చేయ‌లేదు. దాదాపు అంద‌రూ రాజకీయాల్లోనే ఉండ‌టంతో.. స‌గ‌టుపార్టీ అభిమానుల‌కు మాకు నాయ‌క‌త్వం వ‌హించేది ఎవ‌ర‌నే సందేహం సాధార‌ణం. దీనికి రెడీమేడ్‌గా స్టాలిన్ అని వినిపించినా.. వ‌ర్గ‌పోరు మొద‌లుకాద‌నే గ్యారంటీ లేదు. అన్నాద‌మ్ములు.. సోద‌రిమ‌ధ్య ఎటువంటి వివాదం లేద‌ని భావించేందుకు అవ‌కాశం అస‌లే లేదు. క‌నిమొళి వ‌ర్గం నుంచి స్టాలిన్‌కు త‌ప్ప‌కుండా త్రెట్ ఉంటుంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. ఇదంతా.. ఎందుకు అంటే.. 2016 అన్నాడీఎంకే అధినేత్రి.. సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ప‌ళిని, ప‌న్నీరు, శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్‌, ఇలా.. నాలుగైదు వ‌ర్గాలు పుట్టుకొచ్చాయి.
వీరిలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం వున్న చిన్న‌మ్మ సీఎం అవుతుంద‌నే అంద‌రూ భావించారు. కానీ.. పాత కేసులు ఆమెను జైలుకు చేర్చాయి. ఆ త‌రువాత  శ‌శిక‌ళ మేన‌ల్లుడు.. దిన‌క‌ర‌న్ రంగంలోకి దిగినా ఏమీ చేయ‌లేక‌పోయారు. ప‌ళిని, ప‌న్నీరు మ‌ధ్య సీఎంకుర్చీలాట అన్నాడీఎంకేను న‌వ్వుల పాలుచేసింది. ఇంత‌కీ ఆపార్టీను ఎవ‌రు న‌డ‌పాలి. అస‌లు కేడ‌ర్‌ను న‌డిపించేది ఎవ‌రు.. దిశానిర్దేశం చేసేది ఎవ‌రంటే.. మౌన‌మే స‌మాధానం. ప్ర‌జాక‌ర్ష‌క నేత ఒక్క‌రూ లేరు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే గెలుపు.. అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఓ వైపు క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ ఇద్ద‌రూ పార్టీల‌తో రెడీ అయ్యారు. మ‌రోవైపు డీఎంకే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఉండ‌నే ఉంది. ఇటువంటి కీల‌క‌మైన వేళ డీఎంకే లో కూడా కుటుంబ త‌గాదాలు.. వార‌స‌త్వ‌పు పోరుతో అన్నాడీఎంకేగా మారితే.. ప‌రిస్థితి ఏమిట‌నేది ఇప్పుడు రాజ‌కీయంగా మొద‌లైన గంద‌ర‌గోళం. కానీ.. స్టాలిన్‌కు అండ‌గా.. కాంగ్రెస్‌, బీజేపీ ఎవ‌రో ఒక‌రు త‌ప్ప‌కుండా భుజం కాస్తారు. అయితే… ఇదంతా త‌మ ప్ర‌యోజ‌నంకోస‌మా.. నిజంగా త‌మిళ‌నాట రాజ‌కీయ సుస్థిర‌త్వం కోస‌మా అనేది మాత్రం ప్ర‌శ్నార్ధ‌క‌మే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీల‌ను బ‌ల‌ప‌డ‌కుండా మోకాల‌డ్డిన క‌రుణానిధి, జ‌య‌ల‌లిత ఇద్ద‌రూ ఇప్పుడులేరు. ఇదే అద‌నుగా జాతీయ పార్టీలు త‌మ బ‌లం పెంచుకునేందుకు దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకునే అవ‌కాశాలూ లేక‌పోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.